మద్యం కొనాలంటే ఇక నుంచి, ఇది తప్పనిసరి - ప్రభుత్వం తాజా నిర్ణయం..!!
ఏపీలో మద్యం అమ్మకాల్లో కీలక నిర్ణయాలు అమలు కానున్నాయి. పారదర్శకత పెంచేందుకు ఏపీ ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నకిలీలను గుర్తించేందుకు వీలుగా యాప్ ను అందు బాటు లోకి తెచ్చారు. ఇక.. పూర్తి స్థాయిలో విక్రమాలను డిజిటల్ చెల్లింపులు చేసే విధంగా కార్యా చరణ సిద్దం చేస్తున్నారు. ప్రతీ బాటిల్ లెక్క గురించి స్పష్టత ఉండేలా డిస్టలరీ నుంచి వినియోగ దారుడికి వెళ్లే వరకు ట్రాకింగ్ సిస్టమ్ అమలు చేయాలని డిసైడ్ అయ్యారు.
ఏపీ ఎక్సైజ్ శాఖ కొత్త కార్యాచరణ అమలు ప్రారంభించింది. మద్యం విక్రయాల్లో నకిలీలను గుర్తిం చడంతోపాటు అమ్మకాలను పూర్తిస్థాయిలో డిజిటల్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభిం చింది. దీనిలో భాగంగా మద్యం ట్రాకింగ్‌ను మరింత విస్తరించనుంది. ప్రస్తుతం ఎక్సైజ్‌లో డిస్టి లరీ నుంచి మద్యం డిపో వరకు ట్రాకింగ్ విధానం ఉంది. ఇకపై ఆ ట్రాకింగ్‌ను వినియోగదారుడి వరకు తీసుకెళ్లే ప్రయత్నం మొదలుపెట్టింది.

వినియోగదారులు కొనుగోలు చేసే సీసాల వరకు ప్రభుత్వం పక్కాగా వ్యవహరించనుంది. ప్రతి దశలోనూ ట్రాకింగ్ విధానాన్ని అమలు చేయాలని సంకల్పించింది. అయితే, వినియోగదారుల సమాచారం తప్పనిసరిగా తీసుకోవాలా?. లేదా?. అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మద్యం కొనుగోలుదారులు వారి వివరాలను ఇచ్చే అవకాశం తక్కువ. కాబట్టి వ్యక్తిగత వివరాల సేకరణ ఆప్షనల్‌గా ఉండే అవకాశం కనిపిస్తోంది.
దీంతో, కనీసం ఫోన్ నంబరు అయినా తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అలాగే ఇటీవల తీసుకొచ్చిన ఎక్సైజ్ 'సురక్ష యాప్'లో సీసాలను స్కాన్ చేసేవారి వివరాలు వచ్చేలా యాప్‌ను రూపొందించారు. కాగా.. ప్రస్తుతం షాపులు, బార్లలో డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి కాదు. కానీ, అనధికారికంగా డిజిటల్ చెల్లింపుల సౌకర్యం అందుబాటులో ఉంచాలని ఎక్సైజ్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. అయితే, ఇకపై డిజిటల్ చెల్లింపుల సౌకర్యాన్ని షాపులు, బార్లకు తప్పనిసరి చేయనున్నారు.
అన్ని షాపులు, బార్లలో డిజిటల్ పేమెంట్ల విధానం అందుబాటులో ఉంటే వినియోగదారులు నచ్చిన విధంగా నగదు చెల్లిస్తారని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. దీని పైన ఇతర రాష్ట్రాల్లో మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని పరిశీలన చేయాలని డిసైడ్ అయ్యారు. పూర్తి స్థాయిలో కసరత్తు తరువాత పూర్తి స్థాయి డిజిట్ పేమెంట్స్ ప్రక్రియను అన్ని దశల్లో అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications