పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్: పత్రాల వెనక్కి రైతుల ఆందోళన
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతంలోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులో సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట బేతపూడి రైతులు ఆందోళనకు దిగారు. రాజధాని కోసం తీసుకున్న తమ అంగీకారపత్రాలు వెనక్కి ఇవ్వాలని రైతులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
రైతుల డిమాండ్‌పై కుదరదని అధికారులు తేల్చిచెప్పారు. నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ఏపీ రాజధాని భూసేకరణపై స్పందించిన అనంతరం రైతులు ఇలా ఆందోళన బాట ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. దీంతో బేతంపూడి రైతులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు.

తమకు భూములు ఇవ్వడం ఇష్టం లేదంటూ డిప్యూటీ కలెక్టర్ వద్ద వారు మొరపెట్టుకున్నారు. గతంలో తాము ఇచ్ిచన అంగీకార పత్రాలను వెనక్కి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రైతులు భూములు ఇవ్వడానికి ఇష్టపడని గ్రామాల్లో బేతంపూడి కూడా ఉంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో చెప్పారు.
రాజధాని నిర్మాణానికి 20, 25 ఏళ్లు పడుతుందని, ఈలోగా ప్రభుత్వాలు మారితే రైతుల పరిస్థితి ఏమిటని పవన్ కళ్యాణ్ అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలకు రాజ్యాంగపరమైన గ్యారంటీలు ఉండాలనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ కారణంగా బేతంపూడి రైతులు ఆందోళనకు గురైనట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications