Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

AP Budget 2026: బడ్డెట్ స్పీచ్ లో పయ్యావుల అనూహ్యం-ఇదే తొలిసారి..!

ఏపీలో 2026-27 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ (AP Budget 2026) ను ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 3.32 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ లో పలు పథకాలు, రంగాలకు నిధుల కేటాయింపులు చేస్తున్నట్లు పయ్యావుల తెలిపారు. అదే సమయంలో పయ్యావుల తన బడ్జెట్ ప్రసంగంలో పలు అనూహ్య అంశాల్ని తెరపైకి తెచ్చారు. బడ్జెట్ ప్రసంగంలో ఇలాంటి వ్యాఖ్యలు ఉండటం ఇదే తొలిసారి అని ఆర్ధిక శాఖ వర్గాలు చెప్తున్నాయి.

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వివిధ రకాల చర్యలను బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించిన పయ్యావుల కేశవ్.. అదే సమయంలో గత ప్రభుత్వం పెండింగులో పెట్టిన బిల్లుల చెల్లింపులు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఆర్థిక కార్యకలాపాల పునరుద్దరణ చర్యలను కూడా ప్రస్తావించారు. అలాగే స్థానిక సంస్థలకు బదలాయించిన నిధులు, అధిక రుణాలపై వడ్డీలను తగ్గించేందుకు జరిపిన సంప్రదింపుల వివరాలను కూడా బడ్జెట్లో పొందుపర్చినట్లు తెలిపారు.

AP Finance Minister Payyavula Keshav Details YSRCP s Financial Misdeeds in Budget Speech

గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాన్ని ప్రజలకు తెలియచేయడం కోసమే వివరాలను బడ్జెట్ లో ప్రస్తావించామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత ప్రభుత్వం అధిక వడ్డీలకు తీసుకున్న రుణాలపై వడ్డీలు తగ్గించమని వివిధ సంస్థలతో సంప్రదింపులు జరిపామని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా 12.3 శాతంగా ఉన్న వడ్డీని 9 శాతానికి తగ్గించేలా ఆయా ఆర్థిక సంస్థలను ఒప్పించామన్నారు. అధిక వడ్డీలకు తీసుకున్న రుణాల్లో ఇప్పటి వరకు రూ. 43,298 కోట్ల మేర రుణాలకు వడ్డీలు తగ్గించాలని సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. ఈ సంప్రదింపుల ఫలితంగా ఏడాదికి రూ.327 కోట్ల మేర ఆదా అయిందన్నారు. మరో రూ. 1.20 లక్షల కోట్లకు వడ్డీ రేట్లు తగ్గించాలని సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ చర్చలు ఫలమిస్తే ఏటా రూ.1658 కోట్లు ఆదా అవుతుందన్నారు.

AP Finance Minister Payyavula Keshav Details YSRCP s Financial Misdeeds in Budget Speech

అలాగే గత ప్రభుత్వం పెండింగులో పెట్టిన బిల్లుల్లో రూ.24,811 కోట్లు చెల్లింపులు జరిపామని ఆర్ధికమంతత్రి తెలిపారు. ఆర్థిక కార్యాకలాపాల పునరుద్దరణకు ఇరిగేషన్, రహదారుల పనుల కోసం కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రూ. 37030 కోట్లు వ్యయం చేశామన్నారు. పంచాయతీలు, మున్సిపాల్టీల బలోపేతం నిమిత్తం ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఫైనాన్స్ కమిషన్ నిధులను రూ. 3797 కోట్ల మేర బదలాయించామన్నారు. గత ప్రభుత్వం నిలిపేసిన కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 85 స్కీంల పునరుద్దరణకు రూ. 18,701 కోట్లు ఖర్చు పెట్టామని, ఫలితంగా కేంద్రం నుంచి నిధుల విడుదల మరింతగా పెరిగిందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+