ప్రమాదంలో ఎపి ఆర్థిక పరిస్థితి?...జాగ్రత్తంటూ ఆర్బిఐ హెచ్చరిక
Recommended Video

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంకా ఓవర్‌డ్రాఫ్ట్(ఒడి) స్థితిలోనే లోనే కొనసాగుతోరది. గతంలో ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే కనిపించే ఒడి గత కొంత కాలంగా తరుచు కనిపిస్తోంది. దీంతో ఎపి ఆర్థిక పరిస్థితి ప్రమాదకర పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తుండగా... మరోవైపు రిజర్వ్ బ్యాంకు కూడా ఇదే విషయమై ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది.
ఇటీవల కొన్నినెలలుగా రాష్ట్ర ఖజానా తరచూ ఒడిలో పడిపోతుండటం ఎపికి ఆర్థికపరమైన ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తాజాగా ఎపికి 1563 కోట్ల రూపాయల వరకు ఒడి ఉన్నట్లు గుర్తించారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఎపి ప్రభుత్వం జనవరి నెల రెండున ఒడికి వెళ్లింది. డిసెంబర్ నెల కూడా పెద్ద మొత్తంలో ఒడి కొంచెంకొంచెంగా తగ్గుతూ వస్తుందని భావిస్తున్న నేపథ్యంలో మళ్లీ ఫిబ్రవరిలో ఒడికి వెళ్లాల్సి రావడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన నెలకొంటోంది.

ఇప్పటికే...ఒడిలో 13 రోజులు...ఆందోళనకరం
ప్రస్తుత మూడునెలల వ్యవధిలో ఎపి 13 రోజులు ఒడిలో ఉండటం గమనించాల్సిన విషయం. పైగా జనవరి నుంచి చూసుకుంటే 33 రోజుల్లో 13 రోజులు రాష్ట్రం ఒడిలో కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది. కారణం ఓడీలో 14 రోజులపాటు నిరంతరంగా ఉండకూడదు. రిజర్వ్ బ్యాంకుకు సంబంధించి ఈ మార్గదర్శకాలు అత్యంత ప్రాధన్యత కలిగినవి కాగా...రాష్ట్రాలు కొన్నినిబంధనలు పాటించకుంటే రావాల్సిన నిధులను కూడా నిలిపివేయడం జరుగుతుంది.

ఇవీ నిబంధనలు...మీరితే...
ఆర్ బిఐ నిబంధనల ప్రకారం ఇలా ఒడిలో 14 రోజులపాటు నిరంతరం ఉండకూడదు. అలాగే వరుసగా ఐదు పనిదినాలు సాధారణ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ను అధిగమించకూడదు. అలాగే మూడునెలల వ్యవధిలో అంటే ఒకే త్రైమాసికంలో 36 రోజలపాటు వేస్ అండ్ మీన్స్‌కు వెళ్లకూడదు. ఇలా ఈ ఆర్ బిఐ నిబంధనలను దాటితే రాష్ట్రాలకు రావాల్సిన నిధులను రిజర్వ్‌బ్యాంకు నిలిపేయొచ్చు. అయితే మన రాష్ట్రానికి సంబంధించి ఇప్పటి వరకు వరుసగా నాలుగు పనిదినాల్లో ఓడీకి వెళ్లినట్లు తెలుస్తోంది...అలాగే మరోవైపు 13 రోజులు ఒడిలో ఉండటం కూడా జరిగింది. అంతేకాకుండా ఆర్ బిఐ లిమిట్ గా ఉన్న 36 రోజుల నిబంధనకు సంబంధించి కూడా ఎపికి ఇంకా కేవలం రెండు నెలలు సమయం మాత్రమే ఉంది. అంటే 33 రోజుల్లోనే ఇప్పటికే 13 రోజులు పోతే...ఇక మిగిలేది 23 రోజులే...అయితే గట్టెక్కించాల్సిన సమయం చాలా ఉంది.

మరి కొన్ని...ప్రమాద ఘంటికలు...
అలాగే సాధారణ వేస్ అండ్ మీన్స్ లిమిట్ కూడా వందకు ఐదు వరుస పనిదినాలు కాగా, ఈ కేటగిరిలోనూ ఇప్పటికే మూడు పనిదినాలు గడిచిపోవడం గమనార్హం. అందువల్ల అప్రమత్తంగా ఉండాలంటూ ఎపికి రిజర్వ్‌బ్యాంకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ పరిస్థితిని వెంటనే చక్కబరుచుకోకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారడం ఖాయంగా కనిపిస్తోందని ఆర్థిక శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొత్త అప్పులు...తప్పవా!
ఈ ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలల్లోపే ముగియనున్న పరిస్థితుల్లో ఆర్ధిక వెసులుబాటు కోసం కొత్త అప్పులు చేయక తప్పని పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. లేదా మళ్లీ ఇటు వేస్ అండ్ మీన్స్‌కో...లేకుంటే...ఓవర్ డ్రాఫ్ట్ కో వెళ్లాల్సి ఉంటుంది. అయితే...ఇప్పటికే ఆర్ బిఐ కు సంబంధించి అనేక తుది పరిమితులకు చేరువైన నేపథ్యంలో మళ్లీ ఒడికి వెళితే...నిధుల విడుదలపై రిజర్వ్‌బ్యాంకు ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ సవాళ్లను ఎపి ఏ విధంగా అధిగమిస్తుందో వేచి చూడాలి.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications