కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేలు-ఏపీ సర్కార్ ప్రకటన-దరఖాస్తు విధానం ఇలా..

ఏపీలో కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్రం నిర్ణయించిన విధంగా కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేలు పరిహారాన్ని రాష్ట్ర విపత్తుల నిర్వహణ నిధి నుంచి చెల్లించేందుకు వీలుగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులోనే దరఖాస్తు విధానాన్ని కూడా పొందుపరిచింది.

ఏపీలో కోవిడ్ 19తో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు, వారసులకు రూ.50వేలు పరిహారం ఇచ్చేందుకు వీలుగా వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లాల్లో కోవిడ్ మృతులను గుర్తించేందుకు వీలుగా జిల్లా స్దాయిలో కోవిడ్ మృతుల నిర్ధారణ కమిటీలు (సీడాక్)ను ఏర్పాటు చేస్తోంది. ఈ కమిటీలు కోవిడ్ మృతుల కుటుంబాల నుంచి పరిహారం కోసం దరఖాస్తు స్వీకరించాక. వాటిని పరిశీలించి రెండు వారాల్లోగా బాధిత కుటుంబాలకు రూ. 50 వేలు పరిహారం అందిస్తారు.

జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లు కలెక్టరేట్ లో ఇందుకోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తారు. కోవిడ్ మృతుల కుటుంబాల నుంచి పరిహారం కోసం వచ్చే దరఖాస్తుల్ని ఈ సెల్ లో స్వీకరించి, దాన్ని స్వీకరించినట్లు ఓ రసీదు, ప్రత్యేక నంబర్ కూడా ఇచ్చారు. ఆ నంబర్ ఆధారంగానే వారికి పరిహారం అందుతుంది. ఇలా స్వీకరించిన దరఖాస్తుతో పాటు అందుకు కావాల్సిన ధృవపత్రాల్ని కూడా తీసుకుని జిల్లా కలెక్టర్, జిల్లా విపత్తుల నిర్వహణా సంస్ధకు దాన్ని పంపుతారు.

ap government announce rs.50000 to covid 19 deceased families, how to apply for compensation ?

అప్పుడు బాధిత కుటుంబాలకు రెండు వారాల్లోగా పరిహారం అందుతుంది. గతంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద పరిహారం తీసుకున్న వారికి ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిహారం అందదు. అలాగే జిల్లా విపత్తుల నిర్వహణా సంస్ధ నుంచే ఈ పరిహారం అందించాలని వైద్యారోగ్యశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

కోవిడ్ 19 తో చనిపోయిన వారి కుటుంబాల్లో వారి వారసులు లేదా కుటుంబ సభ్యులు పరిహారం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వీరు వైద్యారోగ్యశాఖ ఇచ్చిన నమూనాలో దరఖాస్తు ఫారాన్ని నింపడంతో పాటు మృతుల వివరాలు, ఎక్కడ, ఎప్పుడు, ఎలా చనిపోయారన్న దానిపై వివరాలు అందించాల్సి ఉంటుంది. అలాగే మృతుల తరఫున పరిహారం కావాల్సిన వారి ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాల్ని కూడా సమర్పించాలి.

మృతుల మరణ ధృవీకరణ పత్రంతో పాటు సదరు మరణాన్ని ధృవీకరిస్తూ మృతుల నిర్ధారణ కమిటీ (సీడాక్ ) ఇచ్చే సర్టిఫికెట్, ఆధార్, బ్యాంకు ఖాతా జిరాక్స్ లు, కుటుంబ సభ్యుల సర్టిఫికెట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు సదరు అప్లికేషన్ పై ఆశా వర్కర్, ఏఎన్ఎం, స్ధానిక మెడికల్ ఆఫీసర్ సంతకాలు కూడా ఉండాలి. ఇలా నిర్ణీత నమూనాలో పూర్తి చేసిన దరఖాస్తును కలెక్టరేట్ లో ఏర్పాటు చేసే ప్రత్యేక సెల్ లో సమర్పించాలి. అప్పుడు వారు పరిశీలించి రెండు వారాల్లో పరిహారం అఁదిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+