ఏపీలో పదో తరగతి పరీక్ష ఫీజుల చెల్లింపుకు గడువు ఇదే..!
ఏపీలో వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం ఇవాళ మరో కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈసారి పదో తరగతి రెగ్యులర్, ప్రైవేట్, ఒకేషనల్ పరీక్షలు రాయబోయే విద్యార్ధులు చెల్లించాల్సిన ఫీజు తేదీల గడువును ప్రకటించింది. ఈసారి నేరుగా రాస్తున్న విద్యార్ధులతో పాటు గతేడాది పరీక్షలు తప్పి ఈసారి రాస్తున్న వారికి కూడా ఈ గడువులు వర్తించనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది.
వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్ధులు పాఠశాల హెడ్ మాస్టర్ల వద్ద కానీ, ఆన్ లైన్ విధానంలో కానీ ఈ ఫీజుల్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండు విధానాల్లో ఫీజుల చెల్లింపుకు లేటు ఫీజు లేకుండా ఈ నెల 28 నుంచి నవంబర్ 11 వరకూ చెల్లించవచ్చు. 50 రూపాయల లేటు ఫీజుతో నవంబర్ 12 నుంచి 18 వరకూ చెల్లించే అవకాశం కల్పిస్తున్నారు. అలాగే 200 లేటు ఫీజుతో నవంబర్ 19 నుంచి 25 వరకూ చెల్లించవచ్చు.

అలాగే 500 రూపాయల లేటు ఫీజుతో నవంబర్ 26 నుంచి నవంబర్ 30 వరకూ ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇచ్చారు. అలాగే ఆన్ లైన్ లో www.bse.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ వెబ్ సైట్ లో పరీక్ష ఫీజుతో పాటు ఒకేషనల్ విద్యార్ధుల ఫీజు, మైగ్రేషన్ సర్టిఫికెట్లకు కూడా ఫీజు చెల్లించవచ్చు. తగినంత వయసు లేని అభ్యర్ధులకు సీఎఫ్ఎంఎస్ చలాన్ ద్వారా ఫీజు చెల్లించే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications