అమరావతి టెండర్లపై బిగ్ షాక్-చంద్రబాబు తాజా ప్లాన్ ఇదే..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పనులపై పూర్తి స్దాయిలో దృష్టిసారిస్తోంది. ముఖ్యంగా డిసెంబర్ నాటికి అమరావతి రాజధాని పునర్నిర్మాణం ఎట్టి పరిస్ధితుల్లోనూ ప్రారంభం కావాలని భావిస్తున్న ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ఓవైపు న్యాయపరమైన వివాదాలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు టెండర్ల వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.

అమరావతి రాజధానిలో నిర్మాణ పనుల కోసం గతంలో ఇచ్చిన టెండర్లన్నీ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మున్సిపల్ మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. గత కాంట్రాక్టులు అన్నీ మరో పదిహేను రోజుల్లో ర‌ద్దు చేసి కొత్త‌వాటిని పిలుస్తామని నారాయణ వెల్లడించారు. న‌వంబ‌ర్ మొద‌టి వారం నుంచి డిసెంబ‌ర్ చివ‌రిలోగా అన్ని ప‌నుల‌కూ టెండ‌ర్లు పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇందులో 360.కిమీ ట్రంక్ రోడ్లు,లేఅవుట్లు,3600 ఫ్లాట్లకు, కొండ‌వీటి, పాల‌వాగు, గ్రావిటీ కెనాల్, క‌ర‌క‌ట్ట రోడ్డుకు టెండ‌ర్లు పూర్తిచేస్తామని తెలిపారు.

ap government big shocker on Amaravati capital contractors cancel all previous works

అలాగే అసెంబ్లీ,హైకోర్టు నిర్మాణానికి జ‌న‌వ‌రి నెలాఖ‌రుకు టెండ‌ర్లు పూర్తి చేస్తామని నారాయణ వెల్లడించారు. సెక్ర‌టేరియ‌ట్ భ‌వ‌నాల నిర్మాణానికి డిసెంబ‌ర్ నెలాఖ‌రులో టెండ‌ర్లు పూర్తి చేస్తామన్నారు. మరోవైపు అమ‌రావ‌తి రాజ‌ధాని రైల్వే ప్రాజెక్ట్ కు కేంద్రం ఆమోదం తెల‌ప‌డం శుభ‌ప‌రిణామని మంత్రి తెలిపారు. 2017 నవంబరు 13న ఈ ప్రాజెక్టు కేంద్రానికి ఇచ్చామని,
గత ప్రభుత్వం మూడు ముక్క‌లాట ఆడి ఈ ప్రాజెక్ట్ ను ప‌క్క‌న ప‌డేసిందని గుర్తుచేశారు.

ఎర్రుబాలెం నుంచి నంబూరు వరకూ అమ‌రావ‌తి మీదుగా 57 కిలోమీటర్ల మేర లైన్ 2245 కోట్ల‌తో నిర్మాణం కానుందన్నారు. ఈ రైల్వే లైన్ వ‌ల్ల మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు కనెక్టివిటీ అవుతుందన్నారు. 4 ఏళ్ళలో దీనిని పూర్తి చేస్తామని రైల్వే శాఖ చెపితే.. సీఎం చంద్రబాబు మూడేళ్ళలో పూర్తి చేయాలని అడిగారన్నారు. అమరావతి కి సంబంధించి న్యాయపరమైన అంశాలు ఒకొక్కటిగా పూర్తి చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+