ఏపీ విద్యుత్ ఉద్యోగుల సమ్మె : జగన్ తో సజ్జల, మంత్రుల భేటీ-4 గంటలకు చర్చలకు ఆహ్వానం..

ఏపీలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె పిలుపు కలకలం రేపుతోంది. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న 12 డిమాండ్ల పరిష్కారం కోరుతూ విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఇవాళ ఆర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లబోతున్నారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఓవైపు వారి సమ్మెకు ప్రత్యామ్నాయాల్ని అన్వేషిస్తూనే మరోవైపు చర్చలకు కూడా ఆహ్వనించింది. దీంతో రాబోయే కొన్ని గంటల్లో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.

ఏపీలో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు సిద్దమవుతున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ అప్రమత్తం అయ్యారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పిలిపించుకుని మాట్లాడారు. సమ్మెను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యల్ని వారితో చర్చించారు. అనంతరం ఉద్యోగులతో మరోసారి చర్చలు జరపాలని సూచించారు. వీలైనన్ని డిమాండ్లు పరిష్కరించాలని సూచించినట్లు తెలుస్తోంది.

ap government calls electricity employees jac for talks ahead of strike

దీంతో ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు ఆహ్వానం అందింది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో చర్చలకు రావాలని విద్యుత్ ఉద్యోగులను మంత్రులు ఆహ్వానించారు. సీఎస్ తో పాటు మంత్రుల సబ్ కమిటీ విద్యుత్ ఉద్యోగ నేతలతో చర్చలు జరపబోతోంది. ఇందులో ఉద్యోగులు లేవనెత్తిన 12 డిమాండ్ల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. వాటిలో ఆమోదయోగ్యమైన డిమాండ్లను పరిష్కరించేందుకు మంత్రులు ప్రయత్నించే అవకాశముంది.

సీఎం జగన్ తో భేటీ తర్వాత బయటకు వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ఆస్కారం ఉండబోదని విశ్వాసం వ్యక్తం చేశారు. సాయంత్రం 4 గంటలకు జేఏసీ నేతలను చర్చలకు పిలిచామన్నారు. సీఎస్ తో పాటు మంత్రులు,అధికారులు డిమాండ్ల పై చర్చిస్తామన్నారు. ఇందులో క్లారిటీ వస్తే రాత్రికి ప్రారంభం కావాల్సిన సమ్మె వాయిదా పడటమో, విరమించుకోవడమో జరిగే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+