ఏపీలో దీపావళి సెలవు మార్పు-సర్కార్ ఉత్తర్వులు..!
ఏపీలో దీపావళి సెలవు విషయంలో ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రకటించిన సెలవు దినాన్ని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో నవంబర్ 12న దీపావళి సెలవుగా ప్రకటించగా.. ఇప్పుడు దాన్ని నవంబర్ 13కు మారుస్తూ ఇవాళ ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, సంస్ధలు, ప్రైవేటు సంస్ధలు కూడా దీన్ని అమలు చేయాల్సి ఉంటుంది.

ఏటా ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే సాధారణ సెలవులను అంతకు ముందు సంవత్సరం డిసెంబర్ లోనే ప్రకటిస్తుంది. దీని ప్రకారం నవంబర్ 12నే దీపావళి సెలవు ఇచ్చారు. ఈ మేరకు అప్పట్లో ఉత్తర్వులు, నోటిఫికేషన్ కూడా జారీచేశారు. అయితే తాజాగా పండితుల సలహా మేరకు ఈ సెలవును నవంబర్ 13వ తేదీకి మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను సవరించినట్లు తెలుస్తోంది ఈ మేరకు నవంబర్ 13న ఉద్యోగులతో పాటు ఆఫీసులు, వ్యాపార సంస్ధలకు కూడా నెగోషియబుల్ చట్టం కింద ఈ సెలవు వర్తించబోతోంది.

ప్రతీ ఏటా దీపావళి సెలవును(తిథి ద్వయం) తిధుల ఆధారంగా నిర్ణయిస్తుంటారు. ఈసారి కూడా ప్రభుత్వానికి వచ్చిన సలహాలు,వినతుల మేరకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం సాధారణ పరిపాలన శాఖ తరఫున సీఎస్ జవహర్ రెడ్డి తాజా సెలవు ఉత్తర్వులను విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులు ఈ మేరకు మార్పును గమనించాల్సి ఉంటుంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications