AP Pensions: ఏపీలో 2లక్షల పెన్షన్లు తొలగింపు ? ప్రభుత్వం క్లారిటీ ఇదే..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లను భారీ సంఖ్యలో తొలగిస్తున్నట్లు ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ప్రతీ నెలా ఇచ్చే పెన్షన్ల సంఖ్య తగ్గిపోతుండమే ఇందుకు కారణం. దీనిపై ఇప్పటికే లబ్దిదారులతో పాటు విపక్షాలు కూడా గగ్గోలు పెడుతున్నారు. తాజాగా దివ్యాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ చేపట్టిన ప్రభుత్వం.. అందులోనూ అనర్హుల్ని తొలగించేందుకు ప్రయత్నిస్తోంది. దీనిపై వ్యతిరేకత వస్తుండటంతో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ లో పెన్షన్ల కోతలపై క్లారిటీ ఇచ్చారు. ఓ వెబ్ సైట్ లో వచ్చిన వార్తను కోట్ చేస్తూ ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది. పెన్షన్లు తీసేస్తున్నారంటూ వివిధ సోషల్ మీడియా, మీడియా, వెబ్ సైట్లలో రకరకాల తప్పుడు కథనాలు వెలువడుతున్నాయని ఆరోపించింది. పెన్షన్లు ఎక్కడా తగ్గించడం లేదని తెలిపింది. పెన్షనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది.

పెన్షన్లు తీసేస్తున్నారంటూ వివిధ సోషల్ మీడియా, మీడియా, వెబ్ సైట్లలో రకరకాల తప్పుడు కథనాలు వెలువడుతున్నాయి. పెన్షన్లు ఎక్కడా తగ్గించడం లేదు. పెన్షనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాస్తవానికి విరుద్ధంగా వెలువడుతున్న వార్తలు, సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ప్రజలు ఎవరూ నమ్మొద్దు.… pic.twitter.com/Hueao6CGkX
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) February 21, 2025
వాస్తవానికి విరుద్ధంగా వెలువడుతున్న వార్తలు, సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ప్రజలు ఎవరూ నమ్మొద్దంటూ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పష్టత ఇచ్చింది. అయితే క్షేత్రస్ధాయిలో పరిస్దితులు గమనిస్తున్న లబ్దిదారులకు ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ ఏమాత్రం ఊరటనిస్తుందో చూడాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పక్కాగా అమలు చేస్తున్న పథకం పెన్షన్లు మాత్రమేన్న ప్రచారం నేపథ్యంలో వీటిని కూడా తొలగిస్తున్నారన్న చర్చ ప్రభుత్వాన్ని చికాకు పెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విధంగా వివరణ విడుదల చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications