అమరావతి: ఉపాధ్యాయ అభ్యర్థులకు నిర్వహించ తలపెట్టిన టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ (టెట్)ను ఎపి ప్రభుత్వం వాయిదా వేసింది. 14వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అయితే దీనికంటే ముందే జనవరిలో టెట్ నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం ఏర్పాట్లను కూడా చేసింది. అయితే పరీక్షకు సిద్ధమయ్యేందుకు సమయం చాలా తక్కువగా ఉందన్న విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తడంతో, వారి వినతి మేరకు టెట్ ను మూడు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు బుధవారం ఉత్తర్వులు సైతం జారీ చేసింది.

ఎపి ప్రభుత్వ నిర్ణయంతో జనవరి 17న జరగాల్సిన టెట్ ఎగ్జామ్ ఫిబ్రవరికి వాయిదా పడింది. టెట్ వాయిదా ప్రభావం డిఎస్సీ మీద ఉండదని మంత్రి గంటా మీడియాతో అన్నారు. మరోవైపు ప్రభుత్వం నిర్ణయంపై ఉపాధ్యాయ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ విజ్ఞప్తిని స్వీకరించి పరీక్షను వాయిదా వేయడంపై ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి Subscribe to Telugu Oneindia.
ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!