ఏపీ సచివాలయాల్లో బదిలీలకు మార్గదర్శకాలు జారీ-వీటిపై ఉద్యోగుల అభ్యంతరాలు..!

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బదిలీలకు రంగం సిద్ధమైంది. ఇవాళ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల బదిలీ కోసం జీవో 5ను విడుదల చేసింది. అయితే ఇందులో ప్రభుత్వం పొందుపరిచిన ఓ నిబంధనపై మాత్రం ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వం వెంటనే దీనిపై పునరాలోచన చేయాలని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల.అంకమ్మరావు కోరారు.

ap village ward secretariat employees urges government to rethink on own mandal rule in transfers

గ్రామ,వార్డు సచివాలయాలను, సచివాలయ ఉద్యోగులను హేతుబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల గ్రామ, వార్డు స్థాయిలో సమర్థవంతమైన పాలన , స్వర్ణ ఆంధ్ర విజన్ @2047 లక్ష్యాల సాధన సాధ్యమవుతుంది. సచివాలయాలను జనాభా ఆధారంగా ఏబీసీడీ కేటగిరీలుగా వర్గీకరించారు. అలాగే ఉద్యోగులను జనరల్ పర్పస్, స్పెసిఫిక్ పర్పస్ , ఆస్పిరేషనల్ గా వర్గీకరించారు. సచివాలయాల్లో విధుల నిర్వహణకు అవసరమైనంత మంది ఉద్యోగులను నియమించాలని ఆదేశించారు. దీని ప్రకారం కేటగిరీ ఏ సచివాలయాల్లో కనీసం ఆరుగురు, బీలో కనీసం ఏడుగురు, సీలో 8 మంది ఉండాలి.

మే 31, 2025 నాటికి ఒక గ్రామ, వార్డు సచివాలయంలో 5 సంవత్సరాల నిరంతర సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 5 సంవత్సరాలు పూర్తి చేయని సచివాలయం ఉద్యోగులు కూడా వ్యక్తిగత అభ్యర్థనపై బదిలీకి అర్హులుగా పేర్కొంది. బదిలీల ప్రయోజనం కోసం గ్రామ, వార్డు సచివాలయంలో అన్ని కేడర్లు, పోస్టులలో పనిచేసిన సంవత్సరాల సంఖ్యను "స్టే పీరియడ్" గా పరిగణిస్తారు.

ఏ సచివాలయం ఉద్యోగిని కూడా వారి స్వంత మండలంలో పోస్ట్ చేయకూడదని పేర్కొంది. అలాగే నిర్దేశించిన అన్ని పోస్టులను తప్పనిసరిగా భర్తీ చేయాలని తెలిపింది. ప్రతీ సచివాలయంలో నిర్దేశించిన సంఖ్యలో సచివాలయం ఉద్యోగుల నియామకంతో సహా అన్ని బదిలీలకు ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, నియామక అధికారులకు బాధ్యతలు అప్పగించింది. బదిలీలు పూర్తయ్యాక నిర్దేశించిన పోస్టుల కంటే ఎక్కువ మంది సచివాలయం ఉద్యోగులు ఉంటే వారు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అదే గ్రామ,, వార్డు సచివాలయంలో పని చేస్తారు.

జిల్లా కలెక్టర్లు జూన్ 30లోగా సచివాలయం ఉద్యోగుల హేతుబద్ధీకరణ, బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలి. జూన్ 30 తర్వాత తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బదిలీలు అనుమతించబడవు.హేతుబద్ధీకరణ, బదిలీ ప్రక్రియ పూర్తయిన తర్వాత, జూలై 10లోగా సచివాలయ ఉద్యోగుల వివరాలను హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలి. దృష్టి లోపం ఉన్న ఉద్యోగులు, మానసిక వికలాంగులైన పిల్లలు ఉన్న సచివాలయం ఉద్యోగులు, వారికి అవసరమైన వైద్య సదుపాయాలు ఉన్న స్టేషన్‌కు బదిలీ కోరితే ప్రాధాన్యం ఇస్తారు.

అలాగే గిరిజన ప్రాంతాల్లో రెండు సంవత్సరాలకు పైగా పనిచేసిన సచివాలయం ఉద్యోగులు, 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న సచివాలయం ఉద్యోగులు, దీర్ఘకాలిక వ్యాధులు (క్యాన్సర్, ఓపెన్ హార్ట్ ఆపరేషన్లు, న్యూరోసర్జరీ, కిడ్నీ మార్పిడి మొదలైనవి) ఉన్న తమకు లేదా జీవిత భాగస్వామికి లేదా ఆధారపడిన పిల్లలకు వైద్య కారణాలపై, అలాంటి సదుపాయాలు ఉన్న స్టేషన్‌లకు బదిలీ కోరితే చేస్తారు. కారుణ్య నియామకం ద్వారా నియమించబడిన వితంతు మహిళా సచివాలయం ఉద్యోగులకూ మినహాయింపు ఉంటుంది.

దృష్టి లోపం ఉన్న సచివాలయం ఉద్యోగులకు బదిలీల నుండి మినహాయింపు ఉంటుంది, వారు స్వచ్ఛందంగా బదిలీని కోరితే తప్ప మార్చరు. ఈ కేటగిరీ సచివాలయం ఉద్యోగులను వారికి నచ్చిన ప్రదేశంలో, ఆ గ్రామ, వార్డు సచివాలయంలో స్పష్టమైన ఖాళీ ఉన్నట్లయితే పోస్ట్ చేయాలని తెలిపారు. భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే, వారిని ఒకే స్టేషన్‌లో లేదా ఒకరికొకరు దగ్గరగా ఉండే స్టేషన్‌లలో పోస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రభావితమైన అన్ని బదిలీలు, ప్రాధాన్యత స్టేషన్ల ఎంపిక చేసుకున్న సచివాలయం ఉద్యోగులతో సహా, టీటీఏ ఇతర బదిలీ ప్రయోజనాల కోసం అభ్యర్థన బదిలీలుగా పరిగణిస్తారు.

నోటిఫై చేయబడిన ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాల్లోని అన్ని ఖాళీలను నాన్-ఐటీడీఏ ప్రాంతాలలోని పోస్టులను భర్తీ చేయడానికి ముందుగా భర్తీ చేయాలని సూచించారు. ఐటీడీఏ ప్రాంతాలతో పాటు, జిల్లా కలెక్టర్లు/నియామక అధికారులు అంతర్గత మరియు వెనుకబడిన ప్రాంతాలలో ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఉన్నచోట బదిలీలపై ఖాళీలను భర్తీ చేసేటప్పుడు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఐటీడీఏల నుండి బదిలీ చేయబడిన సచివాలయం ఉద్యోగులను వారి స్థానంలో మరొకరిని పోస్ట్ చేసే వరకు రిలీవ్ చేయకూడదు.నాన్-ఐటీడీఏ ప్రాంతం నుండి ఐటీడీఏ ప్రాంతానికి పోస్ట్ చేయబడిన సచివాలయం ఉద్యోగులు నిర్ణీత సమయంలోగా వారి పోస్టింగ్ స్థలంలో రిపోర్ట్ చేయాలని తెలిపారు. అలా చేయని ఏ సచివాలయం ఉద్యోగి అయినా నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలకు గురవుతారు. పెండింగ్‌లో ఉన్న మొత్తాలను జమ చేయకుండా ఏ సచివాలయం ఉద్యోగిని రిలీవ్ చేయకూడదని తెలిపారు.

జిల్లా కలెక్టర్లు, నియామక అధికారులు నిర్దేశించిన సంఖ్యలో సచివాలయం ఉద్యోగులను నియమించడానికి మరియు బదిలీ చేయడానికి పూర్తి బాధ్యత వహిస్తారని తెలిపారు. ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, సమయానికి పూర్తి చేయాలన్నారు. ఫిర్యాదులకు/ఆరోపణలకు ఎటువంటి అవకాశం ఇవ్వకూడదన్నారు. ఈ పనిని సకాలంలో పూర్తి చేయడానికి జిల్లా కలెక్టర్లకు సహాయపడటానికి ఒక ఐటీ సాధనాన్ని సిద్ధం చేయాలని డైరెక్టర్ ను ఆదేశించారు.

ఇవాళ ప్రభుత్వం విడుదల చేసిన గ్రామ, వార్డు ఉద్యోగుల బదిలీల మార్గదర్శకాల్లో కోరుకున్న వారిని మినహాయించి మిగిలిన వారిని అందరినీ సొంతమండలాల పరిధిలోనే బదిలీలు కల్పించాలని ఉద్యోగసంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వం మాత్రం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సొంతమండలాలలో పని చేయడం కుదరదని,సొంత మండలం కాకుండా ఇతర మండలాలకు బదిలీ చేయాలనే నిబంధన విధించింది. దీనిపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం విధించిన ఈ సొంత మండలాల బదిలీల నిబంధనలపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. చాలీ చాలని జీతాలతో సొంతమండలాలు దాటి పని చేయడం కష్టతరం అవుతుందని వారు చెప్తున్నారరు. అలాగే సచివాలయ ఉద్యోగుల జీతాలు కేవలం రికార్డ్ అసిస్టెంట్ పే స్కేల్ తో ప్రస్తుతం పెరిగిన నిత్యావసర ధరలు, ఇంటి అద్దెలు భరించలేని స్థితిలో ఉద్యోగుల పరిస్థితి ఉన్న విషయం ప్రభుత్వం గుర్తించి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సొంత మండలాల పరిధిలోనే బదిలీలు కల్పించాలని కోరుతున్నారు. తద్వారా ఉద్యోగులను ఆర్ధిక నష్టాల పాలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం, గ్రామ వార్డు సచివాలయాల శాఖ తగు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+