పవన్ ఎఫెక్ట్-కాకినాడ పోర్టు, అందులో షిప్ పై సర్కార్ కీలక నిర్ణయాలు..!
ఏపీలో రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులకు కేంద్రంగా మారిన కాకినాడ పోర్టుతో పాటు అందులో తాజాగా పట్టుబడిన విదేశీ నౌక స్టెల్లా ఎల్ 1 జప్తుపై ఇవాళ మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ సమీక్షించారు. ముఖ్యంగా ఏపీలో పోర్టుల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని వారు నిర్ణయించారు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ టూర్ లో పరిశీలించిన విదేశీ నౌకతో పాటు కాకినాడ పోర్టుపై పలు నిర్ణయాలు తీసుకున్నారు.

ఇవాళ సచివాలయంలో పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన మంత్రులు అచ్చెన్నాయుడు, సత్య కుమార్ యాదవ్, ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, కాకినాడ పోర్టు వ్యవహారంపై చర్చించారు.
మంత్రుల సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాకినాడ పోర్టు భద్రత కోసం ఛీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.కాకినాడ పోర్టులో భద్రత వ్యవస్థ బలోపేతం చేయాలని కూడా మంత్రులు నిర్ణయించారు.

రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని మంత్రుల భేటీలో నిర్ణయించారు. అలాగే పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే ఇక కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కాకినాడ పోర్టు, పరిసర ప్రాంతాల్లో రవాణా కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపనున్నారు. కాకినాడ పోర్టుకు వెళ్లే లారీల నుంచి అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు ఉండేలా ఆదేశాలు ఇవ్వబోతున్నారు. అలాగే కాకినాడ యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెల్లా నౌక జప్తుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications