Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక ఆదేశాలు..!

ఏపీలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల నిర్వహణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇందులో భాగంగా పారదర్శకంగా పరీక్షల నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. పేపర్ లీక్ ల సహా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటోంది. ఈనెల 17 నుండి ఏప్రిల్ 1 వరకూ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగబోతున్నాయి.

టెన్త్ పరీక్షలకు భారీ ఏర్పాట్లు

రాష్ట్ర వ్యాప్తంగా జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను ఎలాంటి అవాంచనీయ ఘటనలకు ఆస్కారం లేని రీతిలో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, విద్య, ఇతర శాఖల అధికారులను ఆదేశించారు. పదవ తరగతి పరీక్షలపై రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సమావేశం ద్వారా సన్నాహక ఏర్పాట్లపై సమీక్షించారు. చీఫ్ సూపరింటిండెంట్ మినహా ఎవరి మొబైల్ ఫోన్ ను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరాదని స్పష్టం చేశారు. ఎవరైనా మొబైల్ ఫోన్లు తీసుకువస్తే వాటిని పరీక్షా కేంద్రాల ప్రధాన గేటువద్దే వాటిని సేకరించి భద్రపర్చి పరీక్ష అనంతరం వాటిని తిరిగి అప్పగించాలన్నారు.

ap government releases update on ssc examinations 2025- here are details

పేపర్ లీక్స్ లేకుండా

పరీక్షలు జరిగే రోజుల్లో పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ణలు విధించాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే పేపర్ లీక్ లు జరగకుండా పరీక్షా కేంద్రాల పరిధిలోని జిరాక్సు,నెట్ సెంటర్లన్నీ మూసి ఉంచేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సిఎస్ విజయానంద్ ఆదేశించారు.పరీక్షలు జరిగే సమయంలో సోషల్ మీడియా సహా ఇతర ప్రసార మాధ్యమాల్లో పేపరు లీక్ వంటి వదంతులు లేదా ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా అలాంటివి వ్యాప్తి జరిగితే వెంటనే విచారణ చేసి తగిన స్పష్టత ఇవ్వాలని, నకిలీ వార్తలు ప్రసారం చేసినట్టు తేలితే అలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటీవల బీఈడీ పరీక్షల నిర్వహణ సమయంలో పేవర్ లీక్ వంటి వదంతులు వచ్చాయని, కావున అలాంటి వాటిపై పూర్తి అప్రమత్తంగా ఉండి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు,ఎస్పీలను ఆదేశించారు.

6.19 లక్షల మంది హాజరు

మొత్తం 3వేల 450 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటిలో 163 సెన్సిటివ్ పరీక్షా కేంద్రాలుగా గుర్తించి అక్కడ ప్రత్యేకమైన సీసీ కెమెరా ఏర్పాట్లు చేశారు. 10వ తరగతి పరీక్షలకు మొత్తం 6లక్షల 19వేల 275 మంది విద్యార్ధులు హాజరు కానుండగా వారిలో 3లక్షల 15వేల 697 మంది బాలురు,3లక్షల 3వేల 578 మంది బాలికలు ఉన్నారు. కర్నూల్,అనంతపురం,ప్రకాశం జిల్లాల్లో ఎక్కువ మంది విద్యార్ధులు హాజరు కానున్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 156 ఫ్లైయింగ్ స్క్వాడ్స్,682 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. అలాగే ప్రతి జిల్లాకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించారు.

కంట్రోల్ రూమ్ ఏర్పాటు

రాష్ట్ర స్థాయిలో 08662974540 నంబరుతో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని జిల్లాల్లో కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సీఎస్ సూచించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన కాన్పిడెన్సిషల్ మెటీరియల్ ను ఇప్పటికే జిల్లాలకు పంపడం జరిగిందని అన్నారు. వేసవి దృష్ట్యా అన్ని పరీక్షా కేంద్రాల్లో తగిన తాగునీటి సౌకర్యం కల్పించాలని, ప్రతి కేంద్రంలో ప్రధమ చికిత్స వంటి సేవలకు ఒక ఎఎన్ఎంను అందుబాటులో ఉంచాలని సూచించారు. పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరాకు ఉండేలా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు.

Take a Poll

ఓపెన్ స్కూల్ పరీక్షలు ఇలా..

అలాగే మార్చి 17 నుండి 28 వరకూ 10వ తరగతి(ఓపెన్ స్కూల్)పబ్లిక్ పరీక్షలు ప్రతి రోజు ఉ.9.30 గం.ల నుండి మధ్యాహ్నం 12.30గం.ల వరకూ జరగనున్నాయని, ఈ పరీక్షలకు 30వేల 334 మంది విద్యార్ధులు హాజరు కానున్నారని డైరెక్టర్ విజయ రామరాజు చెప్పారు.ఈ పరీక్షలను కూడా 471 రెగ్యులర్ పరీక్షా కేంద్రాల్లోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు.రానున్న పరీక్షలను సక్రమంగా సజావుగా నిర్వహించేందుకు వీలుగా అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు విజయ రామరాజు వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+