AP Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీపై సర్కార్ కీలక ప్రకటన..!

ఏపీలో కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత లబ్దిదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల జారీపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం నడుస్తున్న ఈ-కేవైసీ ప్రక్రియ తర్వాత రేషన్ కార్డుల జారీ ఎప్పుడూ చేస్తారన్న దానిపై ఆయన క్లారిటీ ఇచ్చేసారు. దీంతో లబ్దిదారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల్ని మే నెల నుంచి జారీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ స్పష్టంగా ప్రకటించారు. మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీతో ఈ కేవైసీ ప్రక్రియ ముగుస్తున్నందున .. ఆ వెంటనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభిస్తామన్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డునే సైజు తగ్గించి అన్ని వివరాలతో వీటిని జారీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

ap government to issue new ration cards from this may says civil supplies minister manohar

మరోవైపు రాష్ట్రంలో కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల పేర్ల జోడింపులు, తొలగింపులు, స్ల్పిట్ కార్డుల కోసం ఆప్షన్లు కూడా ఇవ్వబోతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అలాగే క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయని ఆయన వెల్లడించారు. అలాగే ఈసారి రేషన్ కార్డులపై ఎవరీ బొమ్మలూ ఉండవని మంత్రి క్లారిటీ ఇచ్చారు. మొత్తం మీద రాష్ట్రంలో ఈ కేవైసీ పూర్తి అయిన తర్వాత ఎంతమందికి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలన్న దానిపై ప్రభుత్వానికి క్లారిటీ వస్తుందని మంత్రి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+