అమరావతి రుణాలు అలా తీరుస్తాం- నారాయణ క్లారిటీ-సీఆర్డీఏ కీలక నిర్ణయాలు..!

ఏపీ రాజధాని అమరావతికి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే అమరావతి రాజధానిలో పనుల్ని జనవరి నుంచి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా అమరావతిలో చేపట్టాల్సిన పనులకు సీఆర్డీయే అథారిటీ సమావేశాల్లో ఆమోదముద్ర వేస్తోంది. ఇదే క్రమంలో ఇవాళ మరో రూ.2723 కోట్ల మేర పనులకు సీఆర్డీయే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇవాళ ఏపీ సచివాలయంలో జరిగిన సీఆర్డీఏ అథారిటీ భేటీలో సీఎం చంద్రబాబుతో మున్సిపల్ మంత్రి నారాయణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణాల చెల్లింపుకు ఇబ్బంది లేకుండా 102 కోట్లు చెల్లించాలని నిర్ణయించారు. వచ్చే జూన్ 12 నాటికి లక్షా 18 వేల ఇళ్లు పూర్తి చేసి ప్రారంభించనున్నారు. అలాగే అమరావతిలో మొత్తం రూ. 2723 కోట్ల పనులకు ఆమోదం తెలిపారు.

ap government to repay amaravati loans by selling lands crda nod for another rs 2723cr works

అమరావతిపై ఇప్పటికీ వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ ఆరోపించారు. అమరావతి కోసం తీసుకున్న భూములను అమ్మడం ద్వారా లోన్ లు కడతామని తెలిపారు. అమరావతిలో వచ్చే ఆదాయంతో నే తిరిగి రుణాలు చెల్లిస్తామన్నారు. ప్రజలపై ఎలాంటి భారం లేకుండా ఈ రుణాలు తీరుస్తామన్నారు. పోర్టులు,మానుఫాక్చర్,ఎలక్ట్రానిక్, ఐటీ పరిశ్రమలతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎవరెంత దుష్ప్రచారం చేసినా మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+