కార్పొరేషన్ చైర్మన్లకు ఏపీ సర్కారు గోల్డెన్ గిఫ్ట్.. కేబినెట్ హోదా !
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా కమిషన్, ఎస్సీ కమిషన్, ప్రెస్ అకాడమీ చైర్మన్లకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన జీజీవో (G.O) ను సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా విడుదల చేశారు. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
క్యాబినెట్ హోదా పొందిన వారు..
కాగా ఈ ముగ్గురికి జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో క్యాబినెట్ స్థాయి ప్రోటోకాల్ అమలు కానుంది. అలాగే వేతనాలు, అలవెన్సులు కూడా అదే స్థాయిలో లభించనున్నాయి.
- రాయపాటి శైలజ - మహిళా కమిషన్ చైర్‌పర్సన్
- కె.ఎస్. జవహర్ - ఎస్సీ కమిషన్ చైర్మన్
- అలపాటి సురేష్ - ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్

మరోవైపు ఇంతకుముందే ప్రభుత్వం 18 మంది కార్పొరేషన్ చైర్మన్లకు వేతనాలు, అలవెన్సులు ప్రకటించింది. అందులో A కేటగిరీ కింద 12 మంది చైర్మన్లకు వేతనాలు ఇవ్వాలని నిర్ణయించారు. B కేటగిరీ కింద 6 చైర్మన్లకు వేతనాలు ఇవ్వనున్నారు. వీరిలో..
A కేటగిరీ..
- హ్యాండీక్రాఫ్ట్ చైర్మన్
- గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్
- మహిళా కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్
- భవన, ఇతర నిర్మాణ పనుల వర్కర్ల వెల్ఫేర్ బోర్డు చైర్మన్
- ఇంకా మరికొన్ని కార్పొరేషన్‌ల చైర్మన్లు ఉన్నారు.
B కేటగిరీ..
- తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (TUDA) చైర్మన్
- మరో ఐదు కార్పొరేషన్ల చైర్మన్లు
ఈ నిర్ణయంతో ఇకపై సంబంధిత చైర్మన్లు మంత్రులతో సమాన హోదాలో పరిగణించబడతారు. అధికారిక కార్యక్రమాల్లో, ప్రభుత్వ సమావేశాల్లో, జిల్లా స్థాయి పర్యటనల్లో వీరికి కూడా క్యాబినెట్ ర్యాంక్ ప్రోటోకాల్ అనుసరించబడుతుంది. మిగతా కార్పొరేషన్లకు కూడా రాబోయే రోజుల్లో వేతనాలు, అలవెన్సులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సంబంధిత నాయకుల అభిమానులు, కూటమి కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications