రైతుల ఖాతాల్లో రూ 20 వేలు, అమలు ఇలా - ప్రభుత్వం ప్రకటన..!!
ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ముందుగా సాధారణ ఆ తరువాత వ్యవసాయ బడ్జెట్ ను సభ ముందు ప్రతిపాదించారు. 2.94 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదిస్తూ పలు కీలక రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేసారు. ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశ పెట్టారు. రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను సభ లో ప్రతిపాదిస్తూ రైతులు ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం పైన స్పష్టత ఇచ్చారు.
కేటాయింపులు
వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్ లో మంత్రి అచ్చెన్నాయుడు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తమ ప్రభుత్వం వ్యవసాయం, రైతులకు ఇచ్చే ప్రాధాన్యతను వివరించారు. రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిదని పేర్కొన్నారు. రాయితీ విత్తనాలకు రూ.240 కోట్లు ప్రతిపాదించారు. ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ చేస్తామని ప్రకటించారు. బడ్జెట్ లో భూసార పరీక్షలకు రూ.38.88 కోట్లు
విత్తనాల పంపిణీకి రూ.240 కోట్లు, ఎరువుల సరఫరాకు రూ.40 కోట్లు కేటాయించారు.

బడ్జెట్ ప్రతిపాదనలు
అదే విధంగా, పొలం పిలుస్తోంది రూ.11.31 కోట్లు ప్రతిపాదించారు. ప్రకృతి వ్యవసాయం రూ.422.96 కోట్లు, డిజిటల్ వ్యవసాయం రూ.44.77 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణ రూ.187.68కోట్లు, వడ్డీ లేని రుణాలకు రూ.628 కోట్లు, అన్నదాత సుఖీభవ రూ.4,500 కోట్లు,
రైతు సేవా కేంద్రాలకు రూ.26.92 కోట్లు, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ రూ.44.03 కోట్లు, పంటల బీమాకు రూ.1,023 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.8,564.37 కోట్లు, ఉద్యాన శాఖకు రూ.3,469.47 కోట్లు, పట్టు పరిశ్రమకు రూ.108.4429 కోట్లు, వ్యవసాయ మార్కెటింగ్ రూ.314.80 కోట్లు, సహకార శాఖ రూ.308.26 కోట్ల మేర కేటాయింపులు చేసారు.
రైతుల ఖాతాల్లో రూ 20 వేలు
ఇక, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం రూ 4,500 కోట్లను బడ్జెట్ లో ప్రకటించారు. గత ప్రభుత్వం అమలు చేసిన వైఎస్సార్ రైతు భరోసా ను కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో అమలు చేయనుంది. కేంద్రం ఇచ్చే రూ 6 వేల కు రాష్ట్ర ప్రభుత్వం రూ 14 వేలు తో సహా అర్హులైన రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ 20 వేలు అందించనుంది. జనవరిలో సంక్రాంతి వేళ ఈ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ లోనూ ఈ మేరకు ప్రతిపాదనలు చేయటంతో ఈ పథకం అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications