బృహత్తర ప్రణాళిక రూపకల్పనకు చంద్రబాబు ఆదేశాలు- దశ తిరిగేలా
Chandrababu: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 70,462 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,393 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.01 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

కాగా- టీటీడీ ఆధీనంలో ఉన్న ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి ఆలయాన్ని మరింత అభివృద్ది చేయడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఒంటిమిట్టను ఆధ్యాత్మిక- పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అధికారులకు ఆదేశాలను ఇచ్చారు.
ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీ సీతారామ కళ్యాణం విజయవంతంగా నిర్వహించిన అనంతరం ఈ ఆలయ అభివృద్ధి, యాత్రికుల సౌకర్యాల గురించి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఇతర అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు చంద్రబాబు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆలయాన్ని సందర్శించే యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉంటోందని, దీనికి అనుగుణంగా వారికి సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒంటిమిట్ట క్షేత్రం అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
తిరుపతి కాణిపాకం- తాళ్లపాక- గండికోట (నైట్ హాల్ట్)- ఒంటిమిట్ట- శ్రీ కాళహస్తిలను ప్యాకేజీలుగా చేర్చుతూ ఓ టూరిజం ప్యాకేజీ సర్క్యూట్‌ను రూపొందించాలని చంద్రబాబు అన్నారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక టూరిజం సర్క్యూట్‌గా దీన్ని అభివృద్ధి చేయాలని సూచించారు.
ఒంటిమిట్ట చెరువును సుందరీకరించాలని, అందులో బోటింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకుని రావాలని చంద్రబాబు చెప్పారు. అలాగే చెరువు మధ్యలో జాంబవంతుని విగ్రహాన్ని నెలకొల్పాలని అన్నారు. టీటీడీ, దాతలు, ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా ఒంటిమిట్టలో వసతి మెరుగుకు ప్రణాళిక రూపొందించాలని అన్నారు.
మిగిలిన ఆలయ పునరుద్ధరణ పనులన్నీ భారత పురావస్తు శాఖ సహాయంతో చేపట్టాలని సూచించారు. రామతీర్థం, లక్ష్మణ తీర్థాల ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తూ అభివృద్ధి ఉండాలని చెప్పారు. రామాయణం, హిందూత్వ విలువలను తెలిపే విధంగా పోతనగిరిపై శ్రీరామ ప్రాజెక్టును చేపట్టాలని అన్నారు.
ఒంటిమిట్టలో భక్తులందరికీ నిత్యాన్నదానం చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని, ఇందులో భాగంగా తిరుమల తరహాలో అన్నప్రసాద భవనాన్ని నిర్మించాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఒంటిమిట్ట ఆలయం, పరిసర ప్రాంతాల ప్రణాళికాబద్ధ అభివృద్ధి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించడం, యాత్రికుల సౌకర్యాలను మెరుగుపర్చడానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.
-
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications