ఉచిత బస్సు, మహిళలకు రూ 1500 - బడ్జెట్ లో ప్రభుత్వం క్లారిటీ..!!
ఏపీ ప్రభుత్వం 2024-25 వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. 2.94 లక్షల కోట్లతో ఈ బడ్జెట్ ప్రతిపాదనలు సభ ముందు ఉంచింది. ఆర్దిక మంత్రి పయ్యావుల తన బడ్జెట్ లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. అదే విధంగా రాష్ట్రంలో ఆర్దిక కష్టాలను వివరించారు. తమ ముందు ఉన్న బాధ్యతలను ప్రస్తావించారు. వ్యవసాయ, పంచాయితీ రాజ్, విద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇదే సమయంలో సూపర్ సిక్స్ పథకాల గురించి మంత్రి కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టత ఇచ్చారు.
బడ్జెట్ లో క్లారిటీ
ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ గత ప్రభుత్వం ఆర్దిక నిర్వహణలో చేసిన లోపాలను ప్రధానంగా బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. పారిశ్రామిక రంగం దెబ్బ తిందని వివరించారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వివరించారు. రాష్ట్ర ఆర్దిక వ్యవస్థ పతనం అంచున ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర భవిష్యత్ కోసం తమ ప్రభుత్వం కట్టబుడి ఉందని వెల్లడించారు. గత ప్రభుత్వం వనరులను దారి మళ్లించిందని చెప్పారు. గత ప్రభుత్వ లోప బూయిష్ట విధానాల కారణంగా రాష్ట్ర ఆర్దిక వ్యవస్థ దెబ్బ తిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అభివృద్ధి - సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు.

ఉచిత బస్సు ప్రయాణం
కేవశ్ బడ్జెట్ ప్రసంగంలో ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి ప్రస్తావన చేసారు. ప్రభుత్వం హామీలకు కట్టుబడి ఉందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన నెల నుంచే చెప్పినట్లుగా అంతకు ముందు రెండు నెలలో కలిపి నెలకు రూ 4 వేల నుంచి రూ 15 వేల వరకు పెన్షన్లు అందిస్తున్నామని వివరించారు. సూపర్ సిక్స్ హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ ఆర్దిక సంవత్సరంలోనే ప్రారంభించేలా పయ్యావుల తన ప్రసంగంలో సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో ఇతర పథకాల ప్రస్తావన చేయలేదు. రైతులకు ఇచ్చిన హామీల గురించి వివరించారు.
వచ్చే ఆర్దిక సంవత్సరంలో
అయితే, మహిళలకు ప్రతీ నెల రూ 1500 ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ పథకం అమలు వచ్చే ఆర్దిక సంవత్సరంలోనే అమలు చేసే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. ప్రస్తుత బడ్జెట్ లో ఈ పథకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావన చేయలేదు. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి గురించే ఎక్కువగా వివరించారు. మహిళలకు అమలు చేస్తున్న దీపం పథకం గురించి కేశవ్ గుర్తు చేసారు. అదే విధంగా అమ్మకు వందనం పథకం సైతం వచ్చే ఆర్దిక సంవత్సరంలోనే అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ పథకం కోసం నిధుల ప్రస్తావన కేశవ్ తన ప్రసంగంలో చేయకపోవటంతో.. రానున్న నాలుగు నెలల కాలంలో ఈ పథకం అమలయ్యే అవకాశం లేదనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications