ఏపీలో 103 రైతు బజార్లలో సబ్సిడీపై టమాటా అమ్మకాలు..!!

టమాటా ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెరిగిన టమాటా ధరలు దళారులకు కాసులు కురిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పంట తగ్గిపోవడం ఈ ధరలకు కారణంగా చెబుతున్నారు. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం నేరుగా ఈ సమస్య పైన ఫోకస్ చేసింది. సబ్సిడీ ధరల పైన టమాటా అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 103 రైతు బజార్లలో సబ్సిడీ ధరలకు టమాటా అందిస్తోంది. మంత్రి కాకాని దీని పైన ప్రకటన చేసారు.

అధిక ధరలు ఉన్నంత వరకు సబ్సిడీపై టమాటా అందిస్తామని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. టమాటా ధర తక్కువైనా..ఎక్కువైనా రైతులను, వినియోగదారులను ఆదుకుంటామమని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 103 రైతు బజార్లలో సబ్సిడీ టమాటా ఇస్తున్నామని వెల్లడించారు. వినియోగదారులకు జరుగుతున్నా మేలును పక్కదారి పట్టించాలన్నదే టీడీపీ ప్రయత్నమని మండిపడ్డారు. ఇప్పటి వరకు టీడీపీ ఎన్ని టన్నుల టమాటాలు ఇచ్చింది ప్రశ్నించారు. పబ్లిసిటీ కోసం 10 కేజీలు అమ్మి ఫోటోలకు ఫోజులిస్తే సరిపోదన్నారు. బజారులో వినియోగదారులతో మంత్రి మాట్లాడారు. సబ్సిడీపై అందిస్తున్న టమాటా కౌంటర్‌ను మంత్రి పరిశీలించారు.

AP Govt Announces subsidy on Tomato sales in 103 Rythu bazars across the state

రోజుకు 65 నుంచి 70 టన్నుల వరకు రైతు బజార్ల ద్వారా టమాటా అందిస్తున్నామని మంత్రి కాకాని వివరించారు. దేశ వ్యాప్తంగా పంట తగ్గిపోవడం ఈ ధరలకు కారణంగా మంత్రి పేర్కొన్నారు. టమాటా నేలపాలైనా, కొండెక్కినా.. రైతులను వినియోగదారులను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. తమ నియోకజవర్గాల్లో రైతు బజార్లలో ఎమ్మెల్యేలు దగ్గర ఉండి సబ్సిడీ ధరల పైన టమాటా విక్రయాలను పర్యవేక్షిస్తున్నారు. ఆధార్ కార్డు తో ఈ సబ్సిడీ అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఒక్కో కుటుంబానికి ప్రస్తుతం ఒక్కో కేజీ చొప్పున రైతు బజార్లలో టమాటాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని కౌంటర్లు పెంచుతామని ప్రభుత్వం చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+