ప్రజలు సహకరించాలి, ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వినతి..!!

రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వినతి చేసింది. జనగణన వేళ సహకరించాలని కోరింది. ఈ మేరకు జనగణన పై మార్గదర్శకాలు జారీ అయ్యాయి. దేశవ్యాప్తంగా 2027 జనగణన ప్రక్రియ ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. నిబంధనల ప్రకారం జనగణన సిబ్బందికి ప్రశ్నలు అడిగే అధికారం ఉందని, వారు కోరిన సమాచారాన్ని సరైన విధంగా అందించాలని ఏపీ ప్రభుత్వం తెలిపింది. జనగణన కోసం ప్రజల నుంచి సేకరించే సమాచారం పై స్పష్టత ఇచ్చింది.

రాష్ట్రంలో జరగబోయే 2027 జనగణన ప్రక్రియకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కూటమి ప్రభుత్వం కోరింది. 1948 జనగణన చట్టం ప్రకారం ప్రజల విధులు, బాధ్యతలను స్పష్టంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 12న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. జనగణన నిర్వహణ కోసం వచ్చే సిబ్బందికి ప్రజలు తప్పనిసరిగా సహకరించాలని ప్రభుత్వం సూచించింది. నిబంధనల ప్రకారం జనగణన సిబ్బందికి ప్రశ్నలు అడిగే అధికారం ఉందని, వారు కోరిన సమాచారాన్ని సరైన విధంగా అందించాలని తెలిపింది. అలాగే, సెన్సస్ అధికారులు అడిగే ప్రశ్నలకు సరైన సమాచారాన్ని ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొంది. తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది.

ap-govt-appeal-the-people-over-support-for-housing-census-in-the-state-from-may-1-self-enumeration

మార్గదర్శకాలు జారీ

అదే విధంగా ఇంటి యజమానులు సెన్సస్ అధికారులకు పూర్తి సహకారం అందించాలని, ఇళ్లకు వేసే గుర్తులు లేదా నంబర్లు తొలగించడం నేరమని స్పష్టం చేసింది. అలాగే సెన్సస్ ఫారమ్‌లను సరిగ్గా నింపడం కూడా ప్రజల బాధ్యతగా పేర్కొంది. సెన్సస్ చట్టం 1948 ప్రకారం నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించనున్నట్లు వెల్లడించింది. జనగణన అధికారులకు సహక రించని వారికి రూ.1000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని సందర్ భాల్లో జైలు శిక్ష కూడా ఉండొచ్చని హెచ్చరించింది. అయితే, జనగణన కోసం సేకరించిన వ్యక్తిగత వివరాలను ఇతరులు పరిశీలించే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేసింది. జనగణన ప్రక్రియ విజయవంతంగా పూర్తి కావాలంటే ప్రజల సహకారం అత్యంత కీలకమని ప్రభుత్వం పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+