రేషన్ కార్డు లబ్ది దారులకు బిగ్ అలర్ట్ - తాజా నిర్ణయంతో..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న నిర్ణయం అమలుకు శ్రీకారం చుడుతోంది. ఇందు కోసం ముహూర్తం ఖరారు చేసింది. కొత్త రేషన్ కార్డుల పైన కసరత్తు కొనసాగుతోంది. ఇక డిజిటల్ కార్డుల జారీకి రంగం సిద్దం అవుతోంది. ఇదే సమయంలో ఈ నెలాఖరులోగా లబ్దిదారులు ఈ కేవైసీ పూర్తి చేయించాలని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కాగా, ప్రభుత్వం ఇప్పుడు రేషన్ లబ్దిదారుల కోసం మరో నిర్ణయం ప్రకటించింది.
ఇక ప్రతీ నెలా
రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పోషక విలువలతో కూడిన కంది పప్పుతో పాటు తృణధాన్యాలను అందించాలని నిర్ణయించింది. వచ్చే జూన్ నెల నుంచి రేషన్ సరుకులతోపాటు సబ్సిడీపై కిలో కందిపప్పు, ఉచితంగా రాగులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని 1.46 కోట్లకు పైగా ఉన్న రేషన్‌కార్డుదారులకు మూడు నెలలకు సరిపడేలా కందిపుప్పు, ఏడాదికి సరిపడా రాగుల సేకరణ కోసం పౌరసరఫరాల సంస్థ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. రేషన్‌కార్డుదారులతోపాటు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఐసీడీఎస్ లబ్ధిదారులకు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సరిపడేలా రూ.500 కోట్ల విలువైన 47,037 టన్నుల కందిపప్పు, రూ.100 కోట్లకు పైగా విలువైన 25 వేల టన్నుల రాగులు సేకరిస్తోంది.

టెండర్లు ఖరారు
దీంతో పాటుగా 43,860 టన్నుల ఐఎస్ఎస్ గ్రేడ్ పంచదార (జూన్ నుంచి నవంబరు వరకు సరిపడేలా) సేకరణకు ఈ-ప్రొక్యూర్‌మెంట్ విధానంలో ఎన్‌ఈఎంఏల్ పోర్టల్ ద్వారా టెండర్లు ఆహ్వానించింది. టెండర్ల ప్రక్రియ ముగియడంతో నాణ్యమైన కందిపప్పును కిలో ప్యాకెట్ల రూపంలో రాష్ట్రంలోని అన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్లకు రవాణా చేయనున్నారు. రాగులను క్వింటాళ్ల లెక్కన గోనెసంచుల్లో రవాణా చేయనున్నారు. ఇక.. ప్రభుత్వం ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పైన కసరత్తు చేస్తోంది. దీనికి ముందుగానే లబ్దిదారులు ఈ కేవైసీ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఆ తరువాత కొత్త కార్డుల దరఖాస్తుల పరిశీలన.. కొత్తవి జారీ పైన మార్గదర్శకాలను ప్రభుత్వం వెల్లడించనుంది.
ఈ నెలాఖరులోగా
కేంద్ర ప్రభుత్వం అన్ని రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియను 2025 మార్చి 31నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ గడువు తర్వాత ఈకేవైసీ పూర్తి చేయని వారు రేషన్ సబ్సిడీ వదులుకోవాల్సి ఉంటుంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం, నకిలీ రేషన్ కార్డులను అరికట్టడం, అర్హత కలిగిన లబ్దిదారులకు మాత్రమే ప్రభుత్వసాయం అందించడం కోసం ఈ కేవైసీ తప్పని సరి చేసినట్లు అధికారులు వెల్లడించారు. రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. ఈకేవైసీ పూర్తి చేయడానికి గడువు రేషన్ కార్డు బ్యాంకులు ఈ కేవైసీ ప్రక్రియను 2025 మార్చి 31నాటికి పూర్తి చేయాలని తొలుత భావించినా.. ఈ నెల (ఏప్రిల్) నెలాఖరు వరకు సమయం ఇచ్చారు. ఆ తర్వాత మీరు ఈకేవైసీ పూర్తి చేయనట్లయితే రేషన్ కార్డునుంచి మీ పేరు తొలగించనున్నారు.












Click it and Unblock the Notifications