కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విభజన హామీలు నెరవేర్చే బద్వేల్లో పోటీ నుంచి వెనక్కి-బీజేపీకి ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సవాల్

|
Google Oneindia TeluguNews

కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక సందర్భంగా బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ ప్రభుత్వ ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బీజేపీ తీరుపై ఆయన ఇవాళ నిశిత విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగడం రాజకీయ పార్టీల బాధ్యతని, కేంద్రంలో అధికారం ఉందన్న గర్వంతో బీజేపీ ప్రజలను ఓట్లు అడకాకుండా పత్రిక సమావేశాలకు పరిమితం అవుతోందని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.

ప్రభుత్వం పై బురదజల్లేందుకే ఆరోపణలు చేస్తున్నారని, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం ఇది చెయ్యలేదని ప్రశ్నించలేని పరిస్థితి విపక్షాలదని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమశిల నిర్వాసితులకు అన్నివిధాల న్యాయం చేస్తామని ఆయన తెలిపారు. ప్రతి రైతుకు 6 నుంచి 10 లక్షలు నష్టపరిహారం ఇచ్చిన ఘనత వైఎస్సార్ ది అని శ్రీకాంత్ గుర్తుచేశారు. సోమశిల విషయంలో పెండింగ్ లో ఉన్న 19 వేల అప్లికేషన్లలో అర్హులైన అందరికి ఒన్ టైం సెటిల్ మెంట్ చేస్తామన్నారు. ప్రభుత్వం అర్హులైన వాళ్లకు తప్పకుండా న్యాయం చేస్తుందని శ్రీకాంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

ap govt chief whip srikanth reddy challenges bjp, if promises fulfilled withdraw from badvel contest

బీజేపీ నేతలు మందిమార్బలంతో వచ్చి అధికారులపై ఆరోపణలు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్జి ఆరోపించారు. తమకు ప్రజా బలం ఉందని, పోలీసులు అవసరం లేదన్నారు. ప్యారా మిలిటరీ బలగాలు మొహరిపజేసి హడావుడి చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని... మొత్తం ఆర్మి బలగాలు దించినా తమకు ప్రజాబలం ఉందని శ్రీకాంత్ తెలిపారు. నిష్పక్షపాత ఎన్నికలు జరగాలని తాము కూడా కోరుకుంటున్నామన్నారు. మీకు ప్రజాబలం లేదనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాల్ని ఉద్దేశించి శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ ను నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించాలని తాము కూడా కోరుతున్నట్లు ఆయన తెలిపారు.

కాంగ్రెస్ , బీజేపీ కలయికతోనే రాష్ట్రం నిలువునా విభజన గురైందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. మాకు రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్నారు. .విభజన చట్టంలో హామీలు నేరవేరిస్తే పోటీ నుంచి విరమించుకుంటామని శ్రీకాంత్ తెలిపారు. చట్టంలో ఉన్న హామీలనే అడుగుతున్నామన్నారుు ప్రత్యేక హోదా, దుగరాజపట్నం , స్టీల్ ప్లాంట్ ఇస్తే పోటీ నుంచి విరమించుకుంటామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బద్వేలు సీటును త్యాగం చేస్తామన్నారు.
పెట్రోల్ , డీజల్ , గ్యాస్ ధరలు ఎందుకు పెంచుతున్నారు.. దీనిపై ఎందుకు మాట్లాడడం లేదని బీజేపీని శ్రీకాంత్ ప్రశ్నించారు. వ్యక్తిగతంగా దూషణలు , ఆరోపణలు చేయడం సంస్కారం కాదన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని స్వయంగా ప్రధాని చెప్పారని, ఆదినారాయణ రెడ్డి ఆరోపణలు కేవలం కేంద్రంలో పదవి కోసమేనన్నారు... రాజకీయ ప్రజనాల కోసం రాజకీయ భిక్ష పెట్టినవారిపై ఆరోపణలు చేస్తున్నారని ఆదినారాయణరెడ్డిని విమర్శించారు.

స్వప్రయోజనాల కోసం సంస్కారం మరిచిపోవద్దని ఆయనకు సూచించారు. డిపాజిట్లు రావని తెలిసి ప్రచారం వదిలేసి అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నేతలపై శ్రీకాంత్ మండిపడ్డారు. ఉనికి కాపాడుకోవడం కోసం ఆరాట పడుతున్నారని,
ప్రజల్లోకి తిరిగి ఓట్లు అడగాలని బీజేపీ నేతలకు సూచించారు. ప్రెస్మీట్లకు పరిమితమై ఆరోపణలు చేయడం మానుకోవాలని కోరారు. టీడీపీ ఢిల్లీ పర్యటన గురించి మాట్లాడ్డం అనవసరమని శ్రీకాంత్ తెలిపారు. మోడీ అంతు తెలుస్తానని చెప్పిన చంద్రబాబు తరువాత వంగి వంగి దండాలు పెట్టారని గుర్తు చేశారు. ఏదో రకంగా ప్రచారం కావాలని టీడీపీ కోరుకుంటోందని శ్రీకాంత్ ఆరోపించారు. చంద్రబాబు గురించి అందరికి తెలుసన్నారు.

English summary
ap government chief whip srikanth reddy on today slams bjp and tdp for their politics in badvel byelection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X