అమరావతికి కొత్త బ్రాండ్ అంబాసిడర్ - చంద్రబాబు 'మెగా' డెసిషన్..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిని ప్రమోట్ చేసేలా కొత్తగా బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని డిసైడ్ అయింది. ఈ మేరకు నామినేషన్ ప్రాతిపదికన నియమించేలా కస రత్తు కొనసాగుతోంది. నియామక మార్గదర్శకాలను ఖరారు చేసింది. అంతర్జాతీయ స్థాయి నగరంగా అమరా వతిని ప్రమోట్ చేసేలా బ్రాండ్ అంబాసిడర్లు పనిచేయాలని ప్రభుత్వం పేర్కొంది. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ బ్రాండ్ అంబాసిడర్ ఎంపిక విషయంలో 'మెగా' నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు కసరత్తు
రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ పై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతిని మరింత ప్రమోట్ చేసేలా బ్రాండ్ అంబాసిడర్లను నియమించేందుకు కసరత్తు మొదలైంది. అందులో భాగం గా నామినేషన్ ప్రాతిపదికన బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకోవాలని సర్కార్ భావిస్తోంది. సీఎంఓ లేదా ముఖ్యమంత్రి నామినేట్ చేసిన వారినే ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతర్జాతీయ స్థాయి నగరంగా అమరావతిని ప్రమోట్ చేసేలా బ్రాండ్ అంబాసిడర్లు పనిచేయాలని సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వ అనుమతి తీసుకుని బ్రాండ్ అంబాసిడర్లను సీఆర్డీఏ ఎంపిక చేయనుంది.

ముగ్గురు పేర్లు పరిశీలన
బ్రాండ్ అంబాసిడర్లుగా ముందుగా ఒక ఏడాది కాలానికి వారి సేవలు వినియోగించుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించింది. వారి పనితీరు ఆధారంగా ఆ తర్వాత పొడిగించాలని నిర్ణయించారు. విజన్ అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడంతో పాటు పెట్టుబడులు తీసుకువచ్చేలా వీరు పనిచేయాలని పేర్కొంది. దీని కోసం బ్రాండ్ అంబాసిడర్లు ఎక్కడికక్కడ సదస్సులు, సమావేశాలు నిర్వహించడంతోపాటు అంతర్జాతీయ వేదికలపై కాన్ఫరెన్సులు, వర్క్ షాపుల్లో పాల్గొనాలని వివరించింది. తద్వారా భాగస్వాముల ను, పెట్టుబడి దారులను కూడా ఆకర్షించాలని సర్కార్ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఏపీ ఆర్థిక వృద్ధిలో అమరావతి ప్రాజెక్టు, స్మార్ట్ సిటీగా రాజధాని కోసం దేశీయ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించేలా బ్రాండ్ అంబాసిడర్లు చూడాలని ప్రభుత్వం పేర్కొంది.

రాజధాని బ్రాండ్ ప్రమోషన్
అమరావతిని అంతర్జాతీయస్థాయి వేదికలకు తీసుకెళ్లడంతోపాటు ప్రజల్లో విస్తృత చర్చ జరిగేలా సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరింది. స్వచ్ఛ అమరావతి కోసం పౌర కార్యకలాపాలు, చెట్లు నాటడం లాంటి కార్యక్రమాలను చేపట్టాలని సూచించింది. అయితే, అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా మెగాస్టార్ చిరంజీవితో పాటుగా ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ పేరు పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. చిరంజీవి అంగీకరిస్తే ఆయనతో పాటుగా మరో ఇద్దరు ప్రముఖల పేర్ల పైన కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దరఖాస్తుల పరిశీలన.. చర్చల తరువాత వచ్చే నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికం గా అమరావతి బ్రాండ్ అంబాసిడర్ల పైన ప్రకటన చేయనున్నారు.












Click it and Unblock the Notifications