EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్, వడ్డీ జమ.. కీలక నిర్ణయాలు..!!
EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక వడ్డీని మరో వారం రోజుల్లో జమ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ కాలానికి సంబంధించిన 8.25 శాతం వడ్డీని జూలై 15లోగా సభ్యుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా 34 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు ప్రయోజనం కలగనుంది. ఈ మేరకు కేంద్రం అధికారికంగా ప్రకటన చేసింది.
పీఎఫ్ ఖాతాదారులకు వర్తించే వడ్డీ పైన కేంద్రం స్పష్టత ఇచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం ఈపీఎఫ్ వడ్డీని జూలై 15 నాటికి దాదాపు 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. దాదాపుగా రూ 44 కోట్ల మేర వడ్డీ మొత్తం చెల్లించనున్నారు. తాజాగా తీసుకొచ్చిన సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ (సైట్స్) ప్లాట్‌ఫామ్ ద్వారా తొలిసారి వడ్డీ పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, సైట్స్ 2.01 పూర్తి అమలు ఈ వారాంతానికి పూర్తవుతుంది. ఆ తర్వాత అన్ని సేవలు అందుబాటులో ఉంటాయి. అలాగే ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్ తెలిపింది. 5 లక్షల రూపాయల వరకు పీఎఫ్ ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్ చేసుకోవచ్చని ప్రకటించింది. దీంతో, పీఎఫ్ క్లెయిమ్‌లు మరింత సులభతరం కానుంది. దేశ వ్యాప్తంగా ఏ ఈపీఎఫ్‌వో ఆఫీస్ నుంచైనా సేవలు పొందే వెసులుబాటు కలగనుంది.

ఖాతాదారులకు ప్రయోజనకరంగా
ఇప్పటి వరకు ఈపీఎఫ్‌వో సేవలు వినియోగం కోసం ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉండేది. కొత్తగా తీసుకొచ్చిన సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ప్లాట్ ఫాం ద్వారా సేవల వేగం పెరిగింది. ఖాతాదారులకు సమయం కలిసి వస్తోంది. నిర్ణీత 'బ్లాక్‌అవుట్ పీరియడ్' పూర్తయిన తర్వాత ఈ వారం నుండి కొత్త ప్లాట్‌ఫారమ్ పూర్తిస్థాయి అమలు ప్రారంభం అవుతాయని అధికారులు వెల్లడించారు. గతంలో వడ్డీ రేటు ప్రకటన తరువాత పీఎఫ్ ఖాతాదారులు మూడు నెలలకు పైగా వేచి ఉండాల్సి వచ్చేది. కాగా, ఇప్పుడు కొత్త విధానం తో వెంటనే ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. ఈ నెల 15వ తేదీ నుంచి వరుసగా ఖాతాదారుల ఖాతాల్లో వడ్డీ జమ కానుంది. సైట్స్ ప్లాట్‌ఫామ్‌లో క్లెయిమ్‌లకు ఆటోమేటిక్ ప్రీ-వాలిడేషన్ కూడా ఉంటుంది.













Click it and Unblock the Notifications