సీఎం రేవంత్ రెడ్డి పై కొండా సుస్మిత షాకింగ్ కామెంట్స్!

పరకాలలో వచ్చే ఎన్నికలలో రేవూరి ప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తారని, మళ్లీ ఆయనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని ఇటీవల జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత రేవంత్ రెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డి కళ్ళు నెత్తికెక్కాయన్న కొండా సుస్మిత

గత ఎన్నికలలో ఐదారు నియోజకవర్గాలలో విజయం సాధించడానికి తన తండ్రి కొండా మురళి ఎంతో కష్టపడ్డారని, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొండ మురళి రేవంత్ రెడ్డి కళ్ళకు కనిపించడం లేదని వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కళ్ళు నెత్తికెక్కాయని కొండా సుస్మిత అన్నారు. అంతేకాదు సీఎం రేవంత్‌‌రెడ్డిని మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత హెచ్చరించారు.

Konda Susmitha daughter of Minister Konda Surekha issues strong warning to CM Revanth Reddy

రేవంత్ రెడ్డి అన్నదమ్ముల స్కాములన్నీ బయటపెడతా: కొండా సుస్మిత

ఈరోజు కొండా సురేఖ జన్మదిన వేడుకలను పరకాలలో నిర్వహించగా ఆ కార్యక్రమంలో కొండ సుస్మిత పాల్గొన్నారు. భారీ కాన్వాయ్ తో బలప్రదర్శన చేశారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎంపై తీవ్ర విమర్శలు చేశారు. తను చేసిన విమర్శలకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి అన్నదమ్ముల స్కాములన్నీ బయటపెడతానని అన్నారు. తమ్ముడి రూ.200 కోట్ల భూ కుంభకోణం గురించి మాత్రమే ఇప్పటివరకు మాట్లాడానని, కౌంటర్ ఇస్తే అన్నీ బయటపెడతానని హెచ్చరించారు.

పరకాల గడ్డ తమ అడ్డా అని పేర్కొన్న కొండా సుస్మిత

అంతేకాదు పరకాల అంటే రేవూరి ప్రకాష్ రెడ్డికి తెలియదని, రేవూరి ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకు కూడా తెలియదని అన్నారు. గత ఎన్నికల సమయంలో కొండా మురళి రేవూరి ప్రకాష్ రెడ్డి కోసం ప్రచారం చేస్తే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచాడని వ్యాఖ్యలు చేశారు. పరకాల గడ్డ తమ అడ్డా అని పేర్కొన్న కొండా సుస్మిత, రేవూరి ప్రకాష్ రెడ్డిని రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు అభ్యర్థిగా ఇప్పుడే ప్రకటించడంపైన అసహనం వ్యక్తం చేశారు.

రాజీనామా చేసి పోటీ చెయ్.. రేవంత్ ప్రచారం చెయ్యమన్న సుస్మిత

రెండేళ్ల వరకు ఎందుకు ఇప్పుడు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలన్నారు..వంచనగిరి లో ఉన్న మా ఇంట్లో ఉండి సీఎం రేవంత్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డి కోసం ప్రచారం చేయాలని, అప్పుడు ప్రజలు రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపిస్తారా, కొండా సుస్మిత ని గెలిపిస్తారా అనేది అర్థమవుతుందని వ్యాఖ్యలు చేశారు.

అప్ కమింగ్ పరకాల ఎమ్మెల్యే.. కొండా సుస్మిత పోస్ట్.. పరకాల పాలిటిక్స్ పీక్!
అప్ కమింగ్ పరకాల ఎమ్మెల్యే.. కొండా సుస్మిత పోస్ట్.. పరకాల పాలిటిక్స్ పీక్!

తనకు ఎవరన్నా భయం లేదన్న కొండా సుస్మిత

గతంలో వేం నరేందర్ రెడ్డికి సలహాదారు పదవి ఇచ్చారని, ఈ మూడేళ్లలో ఆయనకు ఏం సలహాలు ఇచ్చారో వెల్లడించాలని కొండా సుస్మిత ప్రశ్నించారు. దమ్ముంటే ప్రస్తుతం రాజీనామా చేసి ఎవరు గెలుస్తారో చూద్దామని వ్యాఖ్యలు చేసిన సుస్మిత కొండా సురేఖ మురళి మంచివాళ్ళు కాబట్టి వాళ్లు బయట ఎక్కడ ఏమి మాట్లాడటం లేదన్నారు. తనకు ఎవరన్నా భయం లేదని పేర్కొన్న కొండా సుస్మిత వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+