శబరి ఎక్స్​ ప్రెస్ లో సంచలనం.. రైలులోనే ఇద్దరు ఆత్మహత్యాయత్నం.. ఏం జరిగింది..?

శబరి ఎక్స్ ప్రెస్ నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం వరకు సేవలు అందిస్తుంది. నిత్యం దాదాపు 2 వేల మంది ప్రయాణికులు ఈ రైలు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. అయితే ఈ రద్దీ రైలులో షాకింగ్ ఘటన జరిగింది. ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేసుకోబోయారు. వారిని సకాలంలో ఆస్పత్రిలో చేర్పించినా ప్రస్తుతం వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. అసలు ఏం జరిగింది..?

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా చప్రా ప్రాంతానికి చెందిన శిరీష్ కుమార్, సులోచన భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. శిరీష్ ఆటో డ్రైవర్ గా అదే గ్రామంలో ఉన్న ఓ వివాహితతో ఆయనకు పరిచయం ఏర్పడింది. అయితే పలు కారణాల వల్ల తన భర్తకు దూరంగా ఆ వివాహిత పిల్లలతో కలిసి హైదరాబాద్ లోని మూసాపేటలో ఉన్న తన సోదరి ఇంట్లో ఉండేది. అయితే ఆమెను చూసేందుకు శిరీష్ తరచూ వస్తూ పోతూ ఉండేవాడు. ఓ రోజు ఇద్దరూ ఉన్నంట్టుండీ మాయమయ్యారు.

SabariExpress in News Two People Try to Commit Suicide What Really Happened Sabari Express suicide

అయితే తన భర్త ప్రియురాలితో కలిసి వెళ్లిపోయాడని.. ప్రస్తుతం వాళ్లు కోయంబత్తూరులో నివాసం ఉంటున్నారని తెలిసి శిరీష్ భార్య, తన బంధువులతో కలిసి అక్కడకు వెళ్లింది. అక్కడే వారిని గుర్తించి తిరిగి సోమవారం శబరి ఎక్స్ ప్రెస్ లో హైదరాబాద్ కు తీసుకొస్తుండగా రైలు చర్లపల్లి సమీపంలోకి రాగానే శిరీష్, అతని ప్రియురాలు బాత్ రూమ్ లోకి వెళ్లి గడ్డి మందు తాగారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారిని శిరీష్ భార్య సమాచారంతో రైల్వే పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటన శబరి ఎక్స్ ప్రెస్ లో తీవ్ర కలకలం సృష్టించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+