ఉత్తరాషాఢ, రోహిణీ నక్షత్రాల్లో జన్మించినవారే సెప్టెంబరులో కింగ్స్

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబరు నెలలో సూర్యుడు సింహం నుంచి కన్యా రాశిలోకి, శుక్రుడు, బుధ గ్రహాలు అనుకూల స్థానాల్లోకి మారడం వల్ల ఈ రెండు నక్షత్రాల జాతకులకు విశేష ఫలితాలు లభిస్తాయి. వారికి ఏవిధమైన ప్రయోజనాలు కలుగుతున్నాయనే వివరాలను తెలుసుకుందాం.

కుంభరాశి, మీన రాశి సెప్టెంబరు నెల జాతక ఫలం
కుంభరాశి, మీన రాశి సెప్టెంబరు నెల జాతక ఫలం

ఉత్తరాషాఢ నక్షత్రం (ధనూ 2, 3, 4 పాదాలు / మకర 1వ పాదం)

సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు లేదా పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించే వారికి కోరుకున్న ఆఫర్లు వస్తాయి.పాత బాకీలు లేదా నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికందుతుంది. రియల్ ఎస్టేట్, భూముల క్రయవిక్రయాల్లో ఊహించని లాభాలుంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో తండ్రి లేదా పెద్దల సహకారం పూర్తిస్థాయిలో లభిస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారు ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం లేదా సూర్య నమస్కారాలు చేయడం వల్ల శ్రేయస్కరం.

ధనుస్సు రాశి, మకర రాశి సెప్టెంబరు నెల జాతక ఫలం
ధనుస్సు రాశి, మకర రాశి సెప్టెంబరు నెల జాతక ఫలం
Horoscope Those born under the Uttarashadha and Rohini nakshatras will be the kings of September

రోహిణి నక్షత్రం (వృషభ రాశి - 4 పాదాలు)

భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్న ప్రతిష్టంభనలు తొలగి కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఆర్టిస్టులు, మీడియా, గ్లామర్ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. పెళ్లికాని యువతీ యువకులకు వివాహ యోగం బలంగా ఉంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం, శుభకార్యాల నిర్వహణ ఉంటుంది. శుక్రుడి అనుగ్రహం వల్ల నూతన వస్తువులు, ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. లక్ష్మీదేవి అష్టోత్తరం పఠించడం, శుక్రవారం రోజు పేదలకు తెల్లటి వస్తువులు (బియ్యం లేదా పాలు) దానం చేయడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+