రోజూ ఇడ్లీ తింటున్నారా, అయితే ఈ జాగ్రత్తలు అవసరం..!!
ఇడ్లీ దాదాపు ప్రతీ ఇంటా ఉంటుంది. చాలా మంది ఇష్టపడతారు. ఇడ్లీలు చాలా మంది తీసుకునే అల్పాహారం. ఉదయం సమయంలో అల్పాహారంలో ఇతర పదార్ధాలు ఉన్నా.. చాలా మంది ఇడ్లీకే ప్రాధాన్యత ఇస్తారు. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఇడ్లీలు తినే వారికి ఆరోగ్య పరంగానూ ప్రయోజనాలు ఉన్నాయి. అదే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రతల పైనా నిపుణులు సూచనలు చేస్తున్నారు.
ఇడ్లీలు త్వరగా జీర్ణమవుతాయి. జీర్ణ సమస్యలు తలఎత్తవు. గట్ హెల్త్‌కి చాలా మంచిది. ఇడ్లీలు చాలా లైట్‌గా ఉంటాయి. దీంతో.. ప్రతీ ఉదయం ఇడ్లీ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇడ్లీ పోషకాహారం గా భావిస్తారు. ఇడ్లీలకు ఉపయోగించే పిండి రాత్రంతా బాగా పులుస్తుంది. అందుకనే ఇందులో ఔషధ విలువలు పెరుగుతాయి. ఇడ్లీలలో వాడే మినప్పప్పు వల్ల ఇందులో ఉండే ప్రోటీన్లు శరీరానికి లభిస్తాయి. ఇడ్లీలను పూర్తిగా ఆవిరి మీద ఉడికిస్తారు. వీటి తయారీలో ఎలాంటి నూనెలను వాడరు. దీంతో.. ఇడ్లీ ఆరోగ్యవంతమైన అల్పాహారగా చెబుతారు. ఇడ్లీలో గ్లూటెన్ ఉండదు. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇడ్లీలు చక్కని ఆహారంగా నిపుణులు సూచిస్తున్నారు. ఇడ్లీలు తినడం వల్ల ప్రోటీన్ అందుతుంది. ఎక్కవు సేపు ఆకలి కూడా వేయదు. దీంతో ఇతర ఆహారాలు తీసుకోలేదు. ఇడ్లీ పిండిని మినపప్పుతో చేస్తారు. కాబట్టి ఐరన్ చక్కగా అందుతాయి. రక్త హీనత సమస్య తగ్గుతుంది.

నిపుణుల సూచనలు
ఇడ్లీలు తినడం వల్ల లాభాలే కానీ నష్టాలు తక్కువ. అయితే, చిరుధాన్యాలతో ఇడ్లీలను తయారు చేసి తింటే ఇంకా ఎక్కువ పోషకాలను పొందే అవకాశం ఉంటుంది. అనేక బి విటమిన్లు లభిస్తాయి. ఇడ్లీలలో జీర్ణ వ్యవస్థకు మంచి చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఒక ఇడ్లీని తింటే సుమారుగా 40 నుంచి 50 క్యాలరీలు లభిస్తాయి. కొవ్వు అసలే ఉండదు. మిల్లెట్స్‌తో ఇడ్లీలను తయారు చేసి తింటే డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. ఇడ్లీలు ఆరోగ్యకరమే అయినప్పటికీ ప్రస్తుతం రెడీమేడ్ పిండి మార్కెట్‌లో లభిస్తుంది. వాటి వినియోగం లో మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిందే. కొందరికి ఇడ్లీలను తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారు ఇడ్లీలను తినకూడదు. ఇడ్లీల్లో ఫ్యాట్ లెవల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. దీని వల్ల కొవ్వు పట్టదు. బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా కరుగుతుందని సూచిస్తున్నారు.













Click it and Unblock the Notifications