రైతులకు ప్రభుత్వం బంపరాఫర్, పథకాలు అమలు ఇక ఇలా..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ నిరీక్షణ తరువాత కౌలు రైతులకు మేలు చేసే అంశం పైన ప్రకటన చేసింది. ఈ నిర్ణయం ద్వారా ఇక నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలకు అర్హత రానుంది. వ్యవసాయంలో ప్రభుత్వం నుంచి రైతులకు అందే అన్ని రకాల సాయం వీరికి అమలు కానుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన సాంకేతికంగా అన్ని అంశాలను పరిశీలన చేసి.. అమల్లోకి తీసుకురానుంది.
ఏపీ ప్రభుత్వం కౌలు రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా కౌలు రైతులకు తమకు ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రయోజనాలు తమకు వర్తించ చేయాలని కోరుతూ వచ్చారు. భూములున్న రైతులకు మాదిరిగానే పంట సాగుదారు హక్కుపత్రం (సీసీఆర్సీ) ఉన్న కౌలు రైతులకూ విశిష్ఠ గుర్తింపు సంఖ్య(ఐడీ) కేటాయించేందుకు విధి విధానాలు సిద్దం చేస్తు న్నట్లు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీ రాజశేఖర్ వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర అధికారులతో కౌలు రైతులకు ఐడీ కేటాయింపు విధివిధానాల ఖరారుకు సమావేశం జరిగింది. కౌలు రైతులకు ఐడీ కేటాయింపుపై సాంకేతికంగా పరీక్షించిన తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేస్తామని వెల్లడించారు.

దీని వల్ల కౌలు రైతులు కూడా భూములున్న రైతులతో సమానంగా ప్రభుత్వం ద్వారా అన్ని ప్రయోజనాలనూ పొందగలుగుతారని స్పష్టం చేసారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక కౌలు రైతులకు ప్రభుత్వం నుండి వచ్చే వివిధ సబ్సిడీలు, పథకాలు, పంటల బీమా వంటి ప్రయోజనాలు పొందే అవకాశం దక్కుతుంది. అదే విధంగా పీఎం కిసాన్ చెల్లింపులు, అన్నదాత సుఖీభవ, పంటల భీమా, పంట రుణాలపై వడ్డీ రాయితీ, రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు, రాయితీపై సూక్ష్మ పోషకాలు, సూక్ష్మసేద్యంపై రాయితీ, పంట రుణాలు, పెట్టుబడి సాయం తదితర పథకాలు నేరుగా పొందే వీలు కలగనుంది. ఇందు కోసం గ్రామంలో గల రైతు సేవా కేంద్రాల సిబ్బందిని సంప్రదించి, రైతు గుర్తింపు సంఖ్య పొందవచ్చు. నమోదు కొరకు ఆధార్ నెంబర్, ఆధార్ అనుసంధానం చేసిన ఫోన్ నెంబర్, 1బి జిరాక్స్ తీసుకొని గ్రామంలో రైతు సేవా సిబ్బందిని కలిసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications