ఏపీలో వీరి పెన్షన్లు కట్- ముహూర్తం ఫిక్స్, లిస్టులో..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ల మొత్తాన్ని పెంచి అమలు చేస్తోంది. ప్రతీ నెలా ఒకటో తేదీనే లబ్ది దారుల ఇళ్లకు వెళ్లి అందిస్తోంది. కాగా, పెన్షన్లు అందుకుంటున్న వారిలో అర్హత లేని వారు ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. దీంతో, తాజాగా అధికార యంత్రాంగం తో సర్వే చేయించింది. దివ్యాంగు ల సర్టిఫికెట్లతో పెన్షన్లు అందుకుంటున్న వారి వివరాలు సేకరించింది. దీంతో, ఇప్పుడు వీరి పెన్షన్ల రద్దు దిశగా నిర్ణయానికి సిద్దమైంది.
అర్హత లేకపోయినా
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను పెంచింది. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు నెలకు రూ 15 వేలు పెన్షన్ అందిస్తోంది. అయితే, వీరితో పాటుగా వైకల్యంతో బాధ పడుతున్న వారిలో అర్హుల విషయంలోనూ ఫిర్యాదులు వచ్చాయి. దీంతో, ప్రభుత్వం సర్వే చేయించగా ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పెన్షన్ అందుతున్న వారి ఇళ్లకు వైద్య బృందాలను పంపారు. వారికి నిర్ధారణ పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల సమయంలోనే పలు అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం పలు కేటగిరీల్లో ఇస్తున్న పెన్షన్ల పైనా ప్రస్తుతం యంత్రాంగం ఫోకస్ చేసింది.

తనిఖీల ద్వారా
రాష్ట్ర వ్యాప్తంగా 8,18,900మంది మెడిక్, వికలాంగుల పింఛన్లు తీసుకుంటున్నారు. పెద్ద సంఖ్య లో నకిలీ సర్టిఫికెట్లతో వికలాంగ పెన్షన్లను తీసుకుంటున్న ట్లుగా క్షేత్ర స్థాయి నుంచి ప్రభుత్వానికి సమాచారం అందింది. అయితే, పూర్తి స్థాయిలో విచారణ లేకుండా వారికి పెన్షన్లలో కోత పెడితే సమస్యలు వస్తాయని భావిస్తోంది. దీంతో, ప్రభుత్వం ఈ తరహా పెన్షన్ల వెరిఫికేషన్ కోసం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ పెన్షన్లు అందుకుంటున్న వారిని ఫిజికల్‌గా వెరిఫికేషన్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా టీమ్‌లను నియమించింది. మెడికల్ ఫింఛన్ దారులను వారి ఇంటివద్ద మెడికల్ టీమ్ లు తనిఖీలు కొనసాగిస్తున్నాయి.
నోటీసులు - రద్దు
లబ్దిదారులకు దగ్గరగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు.. మెడికల్ కాలేజీల్లో వెరిఫికేషన్ చేయిస్తు న్నారు. పింఛన్ దారులను తనిఖీ చేసే టీమ్‌లో ఆర్ధోపెడీషియన్, జనరల్ పిజీషియన్, పిహెచ్‌సి మెడికల్ ఆఫీసరు, డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు. ఏ కారణంతో పెన్షన్ తీసుకొంటున్నారో... సంబంధిత వైద్యుల ద్వారా రీ వెరిఫికేషన్ చేయించనున్నారు. ఈ రీ వెరిఫికేషన్ ప్రక్రియలో ఎవరైనా ఆరోపణలు ఉన్నట్లుగా బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్లు పొందుతున్నట్లుగా గుర్తిస్తే వారికి సంబంధించి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వనున్నారు. పూర్తి స్థాయిలో పరీశీలన పూర్తయిన తరువాత ప్రభుత్వం వీరికి తొలుత నోటీసులు జారీ చేసి.. ఆ తరువాత పెన్షన్ల రద్దు నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.












Click it and Unblock the Notifications