రేషన్ కార్డు దారులకు భారీ గుడ్ న్యూస్ - ఇక నుంచి కొత్తగా..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రేషన్ షాపుల నిర్వహణ.. సరుకుల పంపిణీలో కీలక మార్పులు చేసింది. రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులను అందించింది. అదే సమయంలో రేషన్ దుకాణాల ద్వారా సరుకులను అందిస్తోంది. ఇదే సమయంలో రేషన్ సరుకుల్లోనూ కొత్తవి అందించాలని నిర్ణయించింది. మార్కెట్ కంటే తక్కువ ధరలకే అందుబాటులోకి తెస్తోంది. తాజాగా రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది.
రేషన్ షాపుల్లో రేషన్ దుకాణాల్లో ప్రజలకు అందించే ఇతర నిత్యావసరాల సరుకులతో పాటు గోధుమ పిండిని కూడా అందించాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రూ.20కే కేజీ గోధుమ పిండిని రేషన్ షాపుల్లో ప్రజలకు అందించనుంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కేజీ గోధుమపిండి రూ.40 నుంచి 80 దాకా ఉంది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా రేషన్ దుకాణాల్లో కేవలం రూ.20కే గోధుమ పిండిని అందించనుంది. ఈ నిర్ణయం జనవరి ఒకటి నుంచి రేషన్ షాపుల్లో అమలు చేయనుంది. మొదటగా రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, పట్టణాలు, నగరాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆ తర్వాత పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని అమలు చేయనుంది.

కాగా, జనవరిలో అందించే ఈ సరుకులను ప్రభుత్వం ఈ నెల 26 నుంచే పంపిణీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం పౌరసరఫరాల శాఖ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఖరీఫ్ సీజన్‌లోనే 51లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు ఇందుకోసం నెల, వారాల చొప్పున టార్గెట్లు ఫిక్స్ చేసినట్లు మంత్రి మనోహర్ పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలు నవంబరు నెలలో 11లక్షల మెట్రిక్ టన్నులు, డిసెంబరులో 25లక్షల మెట్రిక్ టన్నులు, జనవరిలో 8లక్షల మెట్రిక్ టన్నులు, పిబ్రవరిలో 3లక్షల మెట్రిక్ టన్నులు, మార్చిలో 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే విదంగా క్యాలెండర్‌ను సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోలుకు 4041 రైతు సేవా కేంద్రాలు, 3803 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 16,700మంది సిబ్బందితో ధాన్యం కొనుగోలు సిద్దమవుతున్నట్లు తెలిపారు. గతేడాది అనుభవాల దృష్ట్యా 6కోట్ల గోతాలను సిద్దం చేసినట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు.
-
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
MRO అధికారాలు, నెల జీతం ఎంతో తెలుసా..? -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications