రేషన్ లబ్దిదారులకు బిగ్ అప్డేట్, ఇక నుంచి - ప్రభుత్వం తాజా నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వం రేషన్ సరఫరా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తోంది. గత ప్రభుత్వం ప్రత్యేక వాహనాల ద్వారా రేషన్ సరఫరా విధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. తిరిగి రేషన్ షాపుల వద్ద సరుకులను పంపిణీ చేస్తోంది. అదే విధంగా వయసు మళ్లిన వారు, దివ్యాంగులకు ఇంటి వద్దే సరుకులను అందిస్తున్నారు. ఇక, ఇప్పుడు రేషన్ సరఫరాతో పాటుగా అవకతవకల పైన ఎప్పటిక ప్పుడు సమాచారం సేకరించాలని నిర్ణయించింది. ఇందు కోసం పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖలో సంస్కరణల దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో అవకతవకల పైన నేరుగా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం గత నెల నుంచే రాష్ట్రంలోని 30 వేల రేషన్ షాపుల ద్వారా లబ్దిదారుల కు నిత్యావసర సరుకులను పంపిణీ ప్రారంభించింది. దీంతో, ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు .. సరుకుల పంపిణీ సక్రమంగా జరిగేలా ప్రతి రేషన్ షాపు వద్ద క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఏర్పాటు చేసింది. లబ్దిదారులు తమ ఫిర్యాదులను.. అభిప్రాయాను ఈ క్యూ ఆర్ కోడ్ ద్వారా చెప్పుకునే వెసులుబాటు కలుగుతుంది.

ఈ క్యూఆర్ కోడ్ లు ఏర్పాటు ద్వారా సరుకుల పంపిణీపై కార్డుదారులకు ఏమైనా అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేసేందుకు అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. షాపు వద్ద ఉన్న ఆ క్యూఆర్ కోడ్‌ను తమ మొబైల్ ఫోన్‌తో స్కాన్ చేసి క్షణాల్లోనే ఫిర్యాదు చేయవచ్చు. కోడ్‌ను స్కాన్ చేయగానే.. లబ్ది దారులకు కొన్ని ప్రశ్నలు కనిపిస్తాయి. వాటిల్లో ముందుగా ఈ నెల రేషన్ సరుకులు తీసుకున్నారా? సరుకుల నాణ్యతపై సంతృప్తిగా ఉన్నారా? రేషన్ డీలరు సరైన తూకంతోనే సరుకులు ఇచ్చారా? అధిక ధరలు వసూలు చేశారా? డీలరు మీతో మర్యాదగానే వ్యవహరించారా? వంటి ప్రశ్నలు ఉంటాయి. వీటికి వచ్చిన సమాధానాలు.. ఫిర్యాదులు.. అభిప్రాయాలు నేరుగా సంబంధిత ఉన్నతాధికారులకు చేరతాయి. తద్వారా వారు ఆ ఫిర్యాదులు పరిష్కరించేలా తాజాగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసారు.












Click it and Unblock the Notifications