మగాళ్లకూ డ్వాక్రా సంఘాలు - రుణాలు, అర్హతలు..!!

డ్వాక్రా సంఘాలు ఇప్పటి వరకు మహిళలకే పరిమితం. ఇక నుంచి పురుషులకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు అవుతున్నాయి. మహిళా సంఘాలకు ఇచ్చిన విధంగానే ఆర్దిక ప్రోత్సాహకాలు ఇచ్చేలా విధి విధానాలు ఖరారు చేస్తున్నారు. పొదుపు సంఘాల వారీగా పురుషులు తమ స్వయం ఉపాధి పొందేలా ఈ నిర్ణయం రూపకల్పన చేసారు. రాష్ట్రంలో విజయవాడ - విశాఖలో ఏప్రిల్ లో ఈ పురుష డ్వాక్రా సంఘాలను ప్రారంభించనున్నారు. ఇప్పటికే వెయ్యి సంఘాలు ఏర్పాటు దిశగా రంగం సిద్దమైంది.

25 నగరాల్లో అమలు
జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ 2.0 కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 25నగరాల్లో పురుషులతో పొదుపు సంఘాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో తొలి విడతలో భాగం గా ఏపీలో విజయవాడ, విశాఖపట్టణంలో పొదుపు సంఘాలు ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏప్రిల్ లో వీటిని ప్రారంభించేలా ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ సంఘాల ద్వారా మహిళలతో అమ లు చేసిన విధంగానే పురుషుల్లో పొదుపు అలవాటు చేయించాలన్న ఉద్దేశంతో పొదుపు సంఘాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసంఘటిత కార్మికుల ఆర్థిక, సామాజికాభివృద్ధి కోసం వీటిని రూపొందిస్తున్నారు. సంఘాలుగా ఏర్పడిన వారికి బ్యాంకుల నుంచి రుణాలిప్పించి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు కేంద్రం ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది.

AP Govt finalise the guide lines for men Self Help Groups benefits for these groups here

అర్హతలు ఖరారు

ఈ సంఘాల ఏర్పాటులో భవన నిర్మాణ పనులపై ఆధారపడే కార్మికులు, జొమాటో వంటి సంస్థల తరపున ఆహారం, కూరగాయలు, నిత్యావసర సరఫరా చేసే గిగ్ కార్మికులు, ఆటో, రిక్షా, తోపుడు బళ్ల కార్మికులు, వృద్ధులు, పిల్లల సంరక్షణ కేంద్రాల్లో, ఇళ్లలో పనిచేసేవారు. వీధుల్లో చెత్త సేక రించే కార్మికులు పురుషుల పొదుపు సంఘాల్లో చేరేందుకు అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. ఒక్కో సంఘానికి గరిష్ఠంగా ఐదుగురు సభ్యులు ఉంటారు. ప్రతీనెలా ఒక్కో సభ్యుడు కనిష్ఠంగా రూ.100 చొప్పున పొదుపు చేయాల్సి ఉంటుంది. మూడు నెలల తరువాత పొదుపు మొత్తంపై ఆరు రెట్లు లేదా రూ. 1.50 లక్షల రుణాన్ని బ్యాంకుల ద్వారా అందిస్తారు. సభ్యులు సకాలంలో బ్యాంకు రుణం తిరిగి చెల్లించడం ద్వారా అదనపు రుణాన్ని కూడా పొందేలా ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది.

దశల వారీగా
ఏపీలో దశల వారిగా ఈ కార్యక్రమాన్ని విస్తరించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రెండో విడతలో అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, అంబేడ్కర్ కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు జిల్లాల్లో సంఘాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సంఘాల ఏర్పాటులో భాగంగా కార్మికుల గుర్తింపుకోసం ఆయా జిల్లాల్లో త్వరలో సర్వే నిర్వహించాలని మెప్మా అధికారులు నిర్ణయించారు. సభ్యులకు ఇచ్చిన రుణ మొత్తాన్ని తమ కుటుంబ, వృత్తి అవసరాల కోసం, ఉపాధి అవకాశాల కోసం వాడుకునే వెసులుబాటు కల్పించారు. పురుష డ్వాక్రా సంఘాల ఏర్పాటు పైన సానుకూల స్పందన కనిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+