ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పర్యావరణాన్ని పరిరక్షించే చర్యల్లో భాగంగా అమలులో ఉన్న ఈవీ వెహికల్స్‌పై పన్ను మినహాయింపును మరో ఆరు నెలలు పొడిగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు మరింత జోరందుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
మరింత పెరిగే అవకాశం..
ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు వివరీతంగా పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో ఆ వాహనలకు వీట్కోలు పలుకుతూ.. ఈవీ వెహికల్స్‌పై ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీంతోపాటు ఇంధన వాహనాల వినియోగం వల్ల పర్యాపరణపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. దీంతో వాహనదారులను ఈవీ వైపు మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దాంతోపాటు గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. భవిష్యత్తులో ఈ పెరుగుదల కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఆ విధానం అమల్లోకి వచ్చే వరకూ..
దేశంలోనూ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను జోరందుకుంటున్నాయి. ఈవి వాహన వినియోగాన్ని ప్రోత్సహించేలా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే అనేక రాష్ట్రాలలో ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను మినహాయింపు కొనసాగుతోంది. తాజాగా ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేరింది. ఈ వాహనాలపై ఉన్న పన్ను మినహాయింపు గడువును మరో ఆరు నెలలు పాటు పొడిగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. 2018-23తో ముగిసిన ఈవీ విధానం స్థానంలో కొత్త విధానం అమల్లోకి వచ్చేంత వరకూ పన్ను మినహాయింపు పొడిగింపు నిర్ణయం ఉంటుందని ఆ ఉత్తర్వులలో ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ మోటారు వాహనాల చట్టం 1963 కింద ఈవీలకు పన్ను మినహాయింపు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇటు రాష్ట్రంలోనూ గతంతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతూ వస్తోంది.












Click it and Unblock the Notifications