ఎంటైర్ లీగ్స్ నుంచి నెయ్‌మార్ అవుట్- బ్రెజిల్ బిక్కముఖం
ఫిఫా వరల్డ్‌కప్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ బ్రెజిల్‌కు కష్టాలు తప్పట్లేదు. మొరాకోపై గెలిచి తీరుతుందనుకున్న మ్యాచ్ ను డ్రాతో సరిపెట్టుకుంది. ఒక పాయింట్ సాధించినప్పటికీ.. టోర్నమెంట్‌లో నిలదొక్కుకోవాలంటే ఆటతీరును పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఫ్రాన్స్, పోర్చుగల్, అర్జెంటీనా వంటి అగ్ర జట్లతో తలపడాల్సి ఉన్నందున లోపాలను సరిదిద్దుకోక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది.
ఈ పరిణామాల మధ్య బ్రెజిల్ కు మరో షాక్ తగిలింది. సాకర్ సూపర్ స్టార్ నెయ్‌మార్ జట్టుకు అందుబాటులో ఉండట్లేదు. లీగ్స్ మొత్తానికీ దూరం అయ్యాడు. నాకౌట్స్ మాత్రమే ఆడే అవకాశం ఉంది.. అది కూడా మెడికల్ టీమ్ అంగీకరిస్తేనే. అతని రాక అనేది పూర్తిగా మెడికల్ టీమ్ నిర్ణయంపైనే ఆధారపడింది. కాలి కండర గాయంతో కోలుకుంటున్న ఈ స్టార్ ఫార్వర్డ్‌ను గ్రూప్ దశలో తొందరపడి మైదానంలోకి దింపకూడదనే ఆలోచనలో ఉంది బ్రెజిల్ మేనేజ్‌మెంట్.
టోర్నీ మొత్తం మీద అతని గాయం ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతోంది. ఓపికే సరైన మార్గమని మెడికల్ టీమ్ భావిస్తోంది. మొరాకోతో జరిగిన తొలి మ్యాచ్‌లో నెయ్‌మార్ ఆడలేదు. ఆ మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ నెల 19న హైతీతో జరిగే తదుపరి మ్యాచ్‌కూ అతన్ని ఆడించే సాహసం చేయకపోవచ్చు జట్టు మేనేజ్మెంట్. గ్రూప్ దశలో పూర్తి ఫిట్‌నెస్ లేకపోతే నాకౌట్స్ నాటికి కోలుకునేలా చర్యలు తీసుకుంటోంది.

నేమార్ గాయం పరిస్థితి ఏంటి?
మే 17న సాంటోస్ తరఫున ఆడుతున్న సమయంలో నెయ్‌మార్ గాయపడ్డాడు. కాలి కండరంలో గ్రేడ్-2 లెవెల్ చీలిక కనిపించింది. ఇలాంటి సందర్భాల్లో ఏ ప్లేయర్ అయినా నొప్పి లేకుండా పరుగెత్తలేడు. వేగంగా దిశను మార్చలేడు. మ్యాచ్ తీవ్రతను తట్టుకోవడం కూడా కష్టమే అవుతుంది. ఓ ఫుట్ బాల్ మ్యాచ్ లో ఇవన్నీ అవసరమే. దీంతో నెయ్ మార్ ను నాకౌట్స్ వరకు గ్రౌండ్స్ లో దించకూడదని మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అతను వ్యక్తిగత ట్రైనింగ్ సెషన్స్ కు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది.
బ్రెజిల్ ప్లాన్‌లో ఫలితాల పాత్ర
ఈ నెల 24న మియామిలో స్కాట్లాండ్‌తో జరిగే గ్రూప్ మ్యాచ్ వరకు కూడా నెయ్ మార్ బెంచ్‌పైనే ఉండే అవకాశం చర్చలో ఉంది. టీమ్ హెడ్ కోచ్ కార్లో అన్సెలొట్టి కూడా అతనికి అందుతున్న మెడికల్ సపోర్ట్ గురించి మాట్లాడారు. చికిత్స తర్వాత గాయం ఎంతవరకు మానిందో తెలుసుకోవడానికి ఇమేజింగ్ పరీక్షలు చేసే అవకాశాన్ని ఉందని వ్యాఖ్యానించారు. అవి అందిన తర్వాతే నెయ్ మార్ ను త్వరగా జట్టులోకి తీసుకురావాలా, లేక రిహాబ్ కొనసాగించాలా అనేది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications