Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రూ 2.94 లక్షల కోట్లతో బడ్జెట్ - కేటాయింపులు ఇలా..!!

ఏపీ బడ్జెట్ ను ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. అంతకు ముందు ఏపీ మంత్రివర్గం బడ్జెట్ ను ఆమోదించింది. దాదాపు 2.94 లక్షల కోట్లతో ఈ బడ్జెట్ ను రూపకల్ప చేసారు. ఈ బడ్జెట్ లో రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితులను వివరిస్తూనే.. అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. అమరావతి- పోలవరంకు ప్రత్యేక అంశాలుగా గుర్తించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు బడ్జెట్ లో కేటాయింపులు చేసారు. రానున్న నాలుగు నెలల కాలానికి సంబంధించిన కేటాయింపులను బడ్జెట్ లో ప్రతిపాదించారు.

2.94 లక్షల కోట్లతో
2024-25 వార్షిక బడ్జెట్ ను ఆర్దిక మంత్రి కేశవ్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. 2.94 లక్షల కోట్ల తో ప్రతిపాదనలు చేసారు. రెవిన్యూ వ్యవయం అంచనా 2.34 లక్షల కోట్లుగా అంచనా వేసారు. కాగా,
మూల ధనం వ్యవయం అంచనా రూ 32,712 కోట్లుగా పేర్కొన్నారు. రెవిన్యూ లోటు రూ 34,713 కోట్లుగా అంచనా వేసారు. జీఎస్డీపీలో రెవిన్యూ లోటు 4.19 శాతం, జీఎస్డీపీలో ద్రవ్య లోటు 2.19 శాతంగా పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్దిక వ్యవస్థ పతనం అంచున ఉందని కేవశ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పునర్ నిర్మించే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేసారు. పెట్టబడి దారుల విశ్వాసాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు.

AP Govt gives major allocations for Polavaram Amaravati and Welfare in Budget 2024-25

కేటాయింపులు
బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి రూ 18,421 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్య-2,326 కోట్లు,
పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్-16,739 కోట్లు, అర్బన్ డెవలప్ మెంట్ కోసం రూ 11,490 కోట్లు, హౌసింగ్ - రూ 4,012 కోట్లు, జలవనరులు రూ 16,705 కోట్లు, పరిశ్రమలు - వాణిజ్యం రూ 3,127 కోట్లు కేటాయించారు. ఇంధన రంగానికి రూ 8,207 కోట్లు, రోడ్లు -భవనాలకు రూ 9,554 కోట్లు, పర్యాటక శాఖ రూ 322 కోట్లు, పోలీసు శాఖ రూ 8,495 కోట్లు గా ప్రతిపాదించారు.

సంక్షేమ రంగానికి
బడ్జెట్ లో సంక్షేమ రంగానికి భారీగా కేటాయింపులు చేసారు. ఎస్సీ సంక్షేమం - రూ 18,497 కోట్లు, ఎస్టీ సంక్షేమం - రూ 7,557 కోట్లు, బీసీ సంక్షేమం - రూ 39,007 కోట్లు, మైనార్టీ సంక్షేమం రూ 4,376 కోట్లుచ మహిళా సంక్షేమం - 4,285 కోట్లు, స్కిల్ డెవలప్ మెంట్ -రూ 1,215 కోట్లు ప్రతిపాదించారు. పాఠశాల విద్యాశాఖ - రూ.29,909 కోట్లు కేటాయించారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ నిర్వహిస్తున్న పర్యావరణం, అటవీశాఖ కు బడ్జెట్ లో రూ.687 కోట్లు ప్రతిపాదించారు. అమరావతిలో నిర్మాణాలు.. ఔటర్ రింగ్ రోడ్ పనులు.. కేంద్రం నుంచి అందుతున్న సహకారం గురించి కేశవ్ వివరించారు. సూపర్ సిక్స్ లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశ పెడతామని ప్రభుత్వం బడ్జెట్ లో ప్రకటించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+