"విద్యా దీవెన"కు జాయింట్ అకౌంట్ నిర్ణయం మార్పు - లబ్దిదారులకు రిలీఫ్..!!
ఏపీ ప్రభుత్వం విద్యీ దీవెన పథకం లబ్దిదారులకు కీలక సమాచారం ఇచ్చింది. ఇప్పటికే ఈ పథకం లబ్దిదారులు జాయింట్ అకౌంట్లు ఓపెన్ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇందు కోసం ఈనెల 24వ తేదీ గడువుగా నిర్ణయించింది. అయితే, విద్యార్దులు- వారి పేరెంట్స్ వస్తున్న వినతులతో ఈ విడత సాయం పాత ఖాతాల్లోనే జమ చేయాలని నిర్ణయించింది. వచ్చే ఫిబ్రవరిలో విడుదల చేసే మొత్తానికి జాయింట్ ఖాతాలు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.
ప్రభుత్వం తాజా నిర్ణయం:ఏప ప్రభుత్వం విద్యా దీవెన, వసతి దీవెన పథకం లబ్దిదారులకు లబ్ది అందాలంటే జాయింట్ అకౌంట్ ఉండాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పుడు వీటిని సవరించింది. వచ్చే విడత వరకు సమయం ఇచ్చింది. డిగ్రీ, పీజీ, ఐటిఐ, డిప్లొమా, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్ధులకు ప్రభుత్వం ఈ పథకాల ద్వారా లబ్ది అందిస్తోంది. ఇప్పటి వరకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) పద్ధతిలో ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను లబ్దిదారులకు అందజేసేవారు. ఇకపై విద్యార్ధి, తల్లి పేరుతో ఉమ్మడి బ్యాంకు ఖాతాను (జాయింట్ అకౌంట్) తెరవాలని సూచించిన ప్రభుత్వం ఇందుకోసం ఈ నెల 24 వరకు సమయం కేటాయించింది. వాలంటీర్లకు బాధ్యతలు కేటాయించింది.

సంయుక్త ఖాతాలకు సమయం:ఈ యేడాది ఏప్రిల్-జూన్ సమయంలో ప్రభుత్వం రూ. 680.44 కోట్లను 8, 44,336 మంది విద్యార్థుల తల్లులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. తాజాగా ఈ నాలెఖరులోగా 4వ విడత జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు పథకంలో నూతన మార్పులు తీసుకువస్తూ సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. జిల్లా కలెక్టర్‌లు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్స్ (ఎల్‌డిఎమ్), బ్యాంకు కో ఆర్డినేటర్లతో ప్రతేక సమావేశాన్ని ఏర్పాటు చేసి కొత్త నిబంధనలు బ్యాంకు మేనేజర్లకు తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వచ్చే విడత నుంచి అమలు:ప్రతి జిల్లా వెల్ఫేర్ అధికారి కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తూ బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ఒకో బ్రాంచ్‌లో రోజుకు 100 మంది చప్పున కొత్త ఉమ్మడి బాంకు ఖాతాలు తెరిచేలా జిల్లా కలెక్టర్లు ప్రణాళిక రూపొందించి అమలు జరిగేలా బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. అయితే, క్షేత్ర స్థాయిలో దీని పైన విద్యార్దులు..వారి పేరెంట్స్ కు బ్యాంకు ఖాతాల ప్రారంభానికి సమయం కోరుతున్నారు. కళాశాలల్లో సెమిస్టర్ పరీక్షల కారణంగా నిర్దేశిత గడువు పెంచాలనే వినతులు వచ్చాయి. దీంతో, ఈ సారి పాత ఖాతాల్లోనే నగదు విడుదల చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం..వచ్చే విడతకు మాత్రం జాయింట్ ఎకౌంట్లను తప్పని సరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications