ఉద్యోగులకు మెమోలు జారీ : పీఆర్సీ బిల్లుల వ్యవహారం - ముదురుతున్న వివాదం..!!
ఏపీలో పీఆర్సీ పోరు తీవ్రతరం అవుతోంది. ఇటు ప్రభుత్వం సైతం తగిన విధంగా ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా ఇప్పటికే జారీ అయిన జీవోల మేరకు ఈ నెల జీతాలు చెల్లించాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఉద్యోగ సంఘాలు మాత్రం తమకు కొత్త పీఆర్సీ వేతనాలు వద్దని..ఆ జీవోలు రద్దు చేసి.. పాత జీతాలనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాల నేతలను ఆహ్వానించినా వారు ముందుకు రాలేదు. తమ సంఘంలోని ఇతర నేతలను ఒక సారి చర్చలకు పంపారు. ఉద్యోగ సంఘాల నేతల వ్యాఖ్యల తీరు పట్ల మంత్రులు సీరియస్ అవుతున్నారు.

ముదురుతోన్న వ్యవహారం
అందులో భాగంగా.. ఇక, ఉద్యోగులు వస్తేనే చర్చలని తేల్చి చెప్పారు. ఇక, జీతాల చెల్లింపు ద్వారా పాత వేతనాలు.. కొత్త వేతనాల మధ్య తేడా అందరికీ తెలియచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొందరు చెబుతున్నట్లుగా వేతనాలు తగ్గలేదని స్పష్టం చేయటమే ప్రభుత్వం లక్ష్యంగా తెలుస్తోంది. దీని కోసం ట్రెజరీ అధికారులకు ఆర్దిక శాఖ సర్క్యులర్లు జారీ చేసింది. కానీ, అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో బిల్లులు పూర్తి చేయలేదని తెలుస్తోంది. దీంతో...జిల్లా కలెక్టర్లకు బిల్లులను పూర్తి చేయించే బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఇందు కోసం డెడ్ లైన్ విధించింది.

బిల్లులు పూర్తి చేయకపోవటంపై ఆగ్రహం
కానీ, ఎక్కడైతే పూర్తి స్థాయిలో బిల్లులు సిద్దం కాలేదో వారి పైన ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. అయితే, ఫిబ్రవరి 1న సాధ్యమైనంత ఎక్కవ మందికి జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. జీతాల బిల్లులు సిద్దం చేయమని చెప్పటం..సర్వీసు నిబంధనలకు వ్యతిరేకమని మంత్రులు స్పష్టం చేస్తున్నారు. దీంతో.. పీఆర్సీ బిల్లులు చెయ్యని అధికారులకు ఏపీ ప్రభుత్వం మెమోలు జారీ చేసింది. మొత్తంగా 27 మందికి మెమోలు జారీ కాగా.. అందులో ముగ్గురు డీడీలు, 21 మంది సబ్ ట్రెజరీ ఆఫీసర్లు, ఇద్దరు ఏటీఓలు ఉన్నారు.
Recommended Video

అధికారులకు మెమోలు జారీ
జీతాల బిల్లులు సిద్ధం చేయడంలో అలక్ష్యంగా వ్యవహరించినందుకుగానూ అధికారులు.. ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు. దీని ద్వారా.. ఉద్యోగుల సమ్మె వేళ..ప్రభుత్వం ముందుగా జీతాల చెల్లింపుల పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఇక, ఉద్యోగ సంఘాలతో చర్చల పైనా ఒత్తిడి పెంచే వ్యూహాలు అమలు చేస్తోంది. సమ్మెకు వెళ్లకుండా చివరి నిమిషం వరకూ అన్ని ప్రయత్నాలు చేసేందుకు సిద్దంగా ఉందని తెలుస్తోంది. ఇటు, ఉద్యోగ సంఘాల నేతల మధ్య సైతం చర్చలకు వెళ్లాలా లేదా అనే అంశం పైన ఎటుూ తేల్చుకోలేకపోతున్నారు. మంగళవారం చర్చలకు సంంధించి కీలక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications