స్వర్ణ గ్రామ, వార్డుల్లో కీలక నియామకాలు - మార్గదర్శకాలు..!!
సచివాలయ వ్యవస్థలో ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. స్వర్ణ వార్డు, గ్రామ సచివాల యాలుగా మార్చిన ప్రభుత్వం.. ఇందులో మూడంచెల వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. ఇప్పటికే ఉద్యోగుల విధుల పైన స్పష్టత ఇచ్చింది. పంచాయితీలతో సచివాలయ వ్యవస్థ అనుసంధానం పైనా ప్రభుత్వం ఫోకస్ చేసింది. సచివాలయ వ్యవస్థ కోసం ఇప్పటికే అధికార వ్యవస్థలో బాధ్యతల ను ఖరారు చేసిన ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మహకాగా, నియమతులైన వారికి రూ.80,910 - రూ.1,66,880 (ఆర్‌పిఎస్-2022) పే స్కేల్ వర్తిస్తుందని, సాధారణ భత్యాలు చెల్లిస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేసారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయ వ్యవస్థ పేరుతో సహా పలు మార్పులు తెచ్చింది. సచివాలయాల ద్వారానే ప్రజలకు అందించే సేవల పైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సర్వేలత పాటుగా సచివాలయ పరిధిలోని ప్రతీ ప్రభుత్వ సేవ బాధ్యతలను అప్పగించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల సమాచారం.. లబ్దిదారుల విషయంలోనూ సచివాలయాలు పూర్తిగా అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ఉద్యోగుల బాధ్యతలను పునర్వ్యవస్థీకరిస్తూ, పారదర్శకత కోసం కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, అనధికార డిప్యుటేషన్లను రద్దు చేస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంది.













Click it and Unblock the Notifications