ఏపీ ప్రభుత్వం మరో ఉచిత హామీ పథకం అమలు, రేపటి నుంచే..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు కు ఆదేశాలు జారీ అయ్యాయి. రేపు (గురువారం) నుంచే ఈ పథకం అమలు కానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసారు. ఈ నెల 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు ప్రారంభం కానుంది. దీనికి ముందే మరో హామీ అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసారు.
అమల్లోకి మరో హామీ
ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. నేతన్నలకు చేయూత ఇచ్చేలా కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. అదే విధంగా హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీని సర్కారే భరించేలా సీఎం చంద్రబాబు ఆదేశించారు. మగ్గాలకు 200, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించారు. నేతన్నల కోసం ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం నుంచి నిర్ణయాలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు చేపట్టాల్సిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ విషయంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేలా సమీక్షలో నిర్ణయం వెల్లడించారు.

సీఎం ఆదేశాలు
ఇక, హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని చంద్రబాబు ప్రకటించారు. ఈ నిర్ణయాల వల్ల చేనేత రంగం పుంజుకుంటుందని తక్కువ ధరల్లో చేనేత వస్త్రాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. చేనేత కార్మికుల కోసం రూ.5 కోట్లతో త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవం నుంచి ఈ నిర్ణయాలను అమలు చేయాలని చంద్రబాబు నిర్దేశించారు. ఏపీకి చెందిన చేనేత ఉత్పత్తులకు లభించిన 10 జాతీయ అవార్డులను అధికారులు సీఎం చంద్రబాబుకు నిర్దేశించారు. పవర్ లూమ్స్‌కు 500, హ్యాండ్‌లూమ్స్‌కు 200 యూనిట్ల వరకు ఇవ్వనుంది. ఈ మేరకు రూ. 125 కోట్లు ఖర్చు కానుంది.
రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఈ నెల 7వ తేదీ (జాతీయ చేనేత దినోత్సవం) నుంచి అమలు చేయాల్సిన కార్యక్రమాలపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు సమీక్ష నిర్వహించారు.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 5, 2025
1.చేతి మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్
2.ఎన్నికల హామీ… pic.twitter.com/mamOGsHENP
నిబంధనలు
ప్రభుత్వ నిర్ణయం ద్వారా 50,000ల మగ్గాలు, 15,000ల మర మగ్గాలు కలిగిన కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 93,000ల చేనేత కుటుంబాలకు లబ్ధి కలగనుంది. సర్కార్ అనుమతించిన కరెంట్ కన్నా ఎక్కువ వినియోగించిన లబ్ధిదారుల రాయితీ మొత్తానని కోల్పోకుండా ప్రత్యేక నిబంధన తీసుకొచ్చింది. తాజా నిర్ణయం మేరకు చేనేత కుటుంబాలు 200 యూనిట్ల కంటే అదనంగా వినియోగిస్తే 200 యూనిట్ల వరకు బిల్లును సర్కార్ భరిస్తుంది. అదనంగా వినియోగించిన యూనిట్లకు మాత్రం డిస్కంల టారిఫ్ మేరకు ఛార్జీలను వినియోగదారులే చెల్లించాలి. పవర్‌లూమ్స్‌కూ 500 యూనిట్లు దాటితే ఇదే నిబంధన వర్తిస్తుంది. అదేవిధంగా చేనేత కార్మికులను ఆదుకునేందుకు పింఛన్ సదుపాయాన్ని కల్పిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇచ్చిన హామీ మేరకు రూ.4000లు అందిస్తోంది.












Click it and Unblock the Notifications