రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!

రైతులకు బిగ్ అప్డేట్. ప్రభుత్వం రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రైతుల కు మద్దతుగా నిలుస్తూ.. సేవలు అందించేందుకు నిర్ణయించింది. అందులో భాగంగా ప్రభుత్వం -తాజా గా ఏఐఎంఎస్-2.0 యాప్ తీసుకొచ్చింది. ప్రభుత్వ పథకాల నుంచి సాగు పద్దతుల వరకు ప్రతీది ఒకేచోట తెలుసుకోవచ్చు. ఒకే క్లిక్‌తో రైతులకు ఉపయోగపడే ప్రతీ సమాచారం అందించే విధంగా ఏర్పాటు చేసింది. దీని వినియోగం పైన రైతులకు శిక్షణ ఇస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం రైతుల కోసం కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏపీ అగ్రికల్చర్ ఇన్పర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ యాప్‌ ద్వారా భవిష్యత్ సేవలను అందించనుంది. ఈ యాప్ ద్వారా రైతులు సమగ్ర సమాచారం మొత్తం ఒకేచోట తెలుసుకోవచ్చు. ప్రభుత్వ పథకాల నుంచి సాగు పద్దతుల వరకు ప్రతీది ఒకేచోట తెలుసుకోవచ్చు. ఒకే క్లిక్‌తో రైతులకు ఉపయోగపడే ప్రతీ సమాచారం ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. ఈ యాప్ గురించి వ్యవసాయ సిబ్బంది ప్రతీ రైతుకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ యాప్ అందుబాటులోకి రావటంతో ఇప్పటి వరకు రైతులు తమకు కావాల్సిన సమాచారం కోసం ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగాల్సి ఉండేది. ఇప్పుడు ఆ అవసరం లేదు. యాప్ ద్వారానే క్షణాల్లో తెలుసుకునే వెసులు బాటు కలుగుతంది. వ్యవసాయ సేవలను రైతులకు ఆన్ లైన్ ద్వారా అందించాలనే లక్ష్యంతో ఈ యాప్ తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ap-govt-launches-new-aap-for-farmers-to-provide-services-in-farming-production

రైతులకు ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం

ఈ యాప్ వినియోగం గురించి చాలామంది రైతులకు తెలియకపోవడంతో సేవలు వినియోగించు కోలేకపోతున్నారు. దీంతో రైతులందరూ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం మొబైల్ ఫోన్లకు మెస్సేజ్‌లు పంపుతుంది. ఈ యాప్ ద్వారా ఏ సమయంలో పంటలు వేస్తే మంచిదనే సలహాలు, సూచనలు అందిస్తున్నారు. స్థానిక వ్యవసాయ అధికారుల ఫోన్ నెంబర్లు అందుబాటు లో ఉంచారు. అదే విధంగా తెగుళ్ల నివారణ, మందులకు సంబంధించిన వివరాలు పొందు పర్చారు. ఇక.. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీల సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. అదే విధంగా అకాల వరదలు, వర్షాల సమయంలో పంట నష్టాన్ని అంచనా వేసే సదుపాయం ఈ యాప్ లో కల్పించారు. రైతులు తమ సమస్యలను యాప్ ద్వారా అధికారులకు ఫిర్యాదులు చేయవచ్చని వెల్లడించారు. దీంతో పాటుగా స్థానిక మార్కెట్లో ధరల వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+