ఎలక్ట్రిక్ బస్సుల్లో 'స్త్రీ శక్తి' అమలయ్యేనా..!?
ఏపీలో స్త్రీ శక్తి పథకం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకానికి మహిళల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోంది. ప్రభుత్వం సైతం ప్రయాణీకుల ఫీడ్ బ్యాక్ కు అనుగుణంగా మార్పులు చేస్తూ పథకం కొనసాగిస్తోంది. ఆర్టీసీ పరిధిలోని అయిదు కేటగిరీల బస్సుల్లో స్త్రీ శక్తి పథకం అమలు చేస్తున్నారు. కాగా.. రాష్ట్రంలో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశ పెడుతున్నారు. వీటిల్లోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగింపు పైన చర్చ జరుగుతోంది.
ఏఫీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న స్త్రీ శక్తి పథకం కు ఆదరణ పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఈ పథకాన్ని పెద్ద సంఖ్యలో వినియోగించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులతో పథకాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ పరిధిలోని పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మరియు ఎక్స్‌ప్రెస్ బస్సులలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే, ప్రారంభించిన తరువాత తిరుమల కు వెళ్లే బస్సుల్లోనూ ఈ పథకం అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాగా.. ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్ బస్సులు ప్రవేశ పెట్టేందుకు రంగం సిద్దమైంది. తక్కువ నిర్వహణ వ్యయంతో అందించాలనే లక్ష్యంతో సొంతంగా టెండర్లు పిలిచి 1,450 విద్యుత్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని నిర్ణయించింది.

కొత్తగా 1450 విద్యుత్ బస్సులు
కాగా, ఈ బస్సుల్లో తొలుత ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని అధికారులు భావించారు. అయితే, ఇప్పుడు ఈ బస్సులకు సంబంధించి దశల వారీగా ఈ పథకం అమలు పైన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఈ బస్సులు అందుబాటులోకి వచ్చిన తరువాత పథకం అమలు పైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ బస్సులు ఒక్క కిలోమీటరు ప్రయాణానికి సుమారు 1.2 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నిర్దేశించిన టారిఫ్ ప్రకారం యూనిట్‌కు రూ.6.70 చొప్పున ఖర్చు అవుతుంది. డీజిల్ బస్సులతో పోలిస్తే నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ బస్సులను రాష్ట్రంలోని 27 డిపోల పరిధిలో దశలవారీగా ప్రవేశపెట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో.. ఈ బస్సులకు రానున్న రోజుల్లో మరింత ప్రాధాన్యత పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక.. వీటిల్లో ఉచిత ప్రయాణం అమలు పైన అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications