వైసీపీ ప్రభుత్వం చేతికి కొత్త అస్త్రం - చంద్రబాబు చిక్కినట్లేనా : ఎన్నికల వేళ..!?

టీడీపీ అధినేత సభలను జనం పోటెత్తుతున్నారు. ఏ జిల్లాలో సభ పెట్టిన భారీ సంఖ్యలో జన స్పందన కనిపిస్తోంది. గతం కంటే భిన్నంగా చంద్రబాబు రోడ్ షోలు.. సభలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు సభలకు వస్తున్న స్పందనతో పార్టీ శ్రేణులు జోష్ లో ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఆ జోష్ కొనసాగేనా లేదా అనే చర్చ మొదలైంది. ఇప్పటి వరకు చంద్రబాబు సభలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆంక్షలు లేవు. తాజాగా కందుకూరు సభా ప్రాంగణంలో తొక్కిసలాట జరిగి 8 మంది మరణించారు. ఈ ఘటనతో చంద్రబాబు షాక్ అయ్యారు. ప్రధాని, సీఎం జగన్ స్పందించారు. ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇదే సమయంలో సభల నిర్వహణల పైన కొత్త చర్చలు తెర మీదకు వచ్చారు.

కందుకూరు ఘటనపైన కేసు నమోదు

కందుకూరు ఘటనపైన కేసు నమోదు


కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో జరిగిన ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసారు. సెక్షన్ 174 క్రింద ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. అదనపు ఐజీతో పాటుగా రేంజ్ డీఐజీ ఘటనా స్థలిని సందర్శించారు. స్థానిక పోలీసు అధికారుల నుంచి వివరాలు సేకరించారు. సభకు అనుమతి విషయం మొదలు జన సమీకరణ..జరిగిన పరిణామాల పైన ఆరా తీసారు. ఈ మొత్తం వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చకు కారణమైంది. కందూకూరులో ఏ రాజకీయ సభ జరిగినా గతంలో వేరే ప్రాంతంలో నిర్వహించే వారని..ఇప్పుడు సభ జరిగిన ప్రాంతం ఎంపిక వెనుక జన స్పందన బాగా ఉందని చూపించటమే లక్ష్యంగా ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. డ్రోన్ విజువల్స్ లో జన రద్దీని చూపించేందుకు ఇరుకుగా ఉండే ప్రదేశంలో సభ ఏర్పాటు చేసారని విమర్శిలు గుప్పిస్తున్నారు.

భవిష్యత్ సభలపై ప్రభావం

భవిష్యత్ సభలపై ప్రభావం


ఇప్పుడు టీడీపీ నిర్వహించిన సభలో ప్రాణనష్టం జరగటం.. 8 మంది ప్రాణాలు కోల్పోవటం చిన్న విషయం కాదు. పార్టీ పరంగా చంద్రబాబు ఆదుకునేందుకు ముందుకు వచ్చినా.. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. ఈ ఘటనతో భవిష్యత్ లో ఏ పార్టీ సభలు నిర్వహించినా..అనుసరించాల్సిన విధి విధానాల పైన కొత్త మార్గదర్శకాలు జారీ చేసేందుకు రంగం సిద్దం అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏ పార్టీ అయినా సభకు వచ్చే వారికి ఎటువంటి నష్టం లేకుండా నిర్వహణా బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, కేవలం ప్రత్యర్ధి పార్టీల కంటే తమకు జన స్పందన ఎక్కువగా ఉందని చూపించటం కోసమే జనం తరలింపు.. అనుకూలంగా లేని ప్రదేశాల్లో సభల నిర్వహణ జరుగుతున్నాయని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఈ ఘటనతో ఈ మొత్తం రాజకీయ సభల నిర్వహణ పైన ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తోంది.

వ్యూహకర్తల ప్రణాళిల్లోనే లోపమా...

వ్యూహకర్తల ప్రణాళిల్లోనే లోపమా...


ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు సభలు..రోడ్ షోలు నిర్వహించటం కామన్. ఏ పార్టీ సభలోనూ ఇటువంటి ఘటన..ఈ స్థాయిలో ప్రాణనష్టం జరగలేదు. ఇప్పుడు పార్టీలకు రాజకీయ వ్యూహకర్తలుగా ఎంట్రీ ఇచ్చిన వారు ప్రచారం మినహా..భద్రతా పరమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవటమే ఈ ఘటనలకు కారణం గా విశ్లేషణలు మొదలయ్యాయి. కేవలం తాము రాజకీయ వ్యూహాలు అందిస్తున్న పార్టీలకు ప్రచారం కోసమే ఇటవంటి ప్రాంతాల్లో సమావేశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఏపీలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ.. కందుకూరు ఘటనతో మొత్తంగా రాజకీయ సభల నిర్వహణ పైన ఉన్నతాధికారులు కొత్త గైడ్ లైన్స్ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో, ఇవి రాజకీయంగా భవిష్యత్ సభలు - సమావేశాల పైన ఎటువంటి ప్రభావం చూపిస్తాయనే చర్చ మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+