విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్ఐఏ కు ఎలా ఇస్తారు, వారి డ్యూటీ అది కాదు: ఏపి ప్ర‌భుత్వ అభ్యంత‌రం దేనికంటే..!

|
Google Oneindia TeluguNews

జ‌గ‌న్ పై దాడి కేసులో మ‌రో కొత్త ట్విస్ట్‌. జ‌గ‌న్ పై దాడి కేసు విచార‌ణ‌ను ఇప్ప‌టికే ఏపి ప్ర‌భుత్వం పూర్తి చేసింది. అస‌లు ఎన్ఐఏ కు ఇటువంటి కేసులు అప్ప‌గించ‌టం ఏంటి. ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయంగా అనేక మ‌లుపులు తీసుకు న్న జ‌గ‌న్ పై దాడి వ్య‌వ‌హారం లో హైకోర్టు తీసుకున్న నిర్ణ‌యాన్ని హై కోర్టు స‌మ‌ర్ధించ‌టం లేదు. దీని పై ఎన్ఐఏ కు లేఖ రాయాల‌ని నిర్ణ‌యించింది. అస‌లు..ఏపి ప్ర‌భుత్వ అభ్యంత‌రం ఏంటి..

జ‌గ‌న్ పై దాడి కేసులో హై కోర్టు ఇచ్చిన ఆదేశాలు..ఏపి ప్ర‌భుత్వానికి రుచించ‌టం లేదా..? జ‌గ‌న్ పై విశాఖ విమానాశ్ర యం లో జ‌రిగిన దాడి పై విశాఖ పోలీసులు విచార‌ణ నిర్వ‌హించారు. దీని పై ఏపి ప్ర‌భుత్వం సిట్ ను సైతం ఏర్పాటు చేసింది. అయితే, దీని పై విచార‌ణ బాధ్య‌త‌ల‌ను ఏపి పోలీసుల నుండి త‌ప్పించి మూడో సంస్థ‌కు ఇవ్వాల‌ని వైసిపి హై కోర్టును ఆశ్ర‌యించింది. ఈ కేసులో వైసిపి లాయ‌ర్ల వాద‌న‌..ప్ర‌భుత్వ లాయ‌ర్ల వాద‌న హై కోర్టు ప‌రిశీలించింది. జ‌గ‌న్ పై దాడి కేసును ఎన్ఐఏ కు ఇవ్వ‌టం పై ఇటు ఏపి ప్ర‌భుత్వం..అటు కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. దీంతో.. కేంద్రం ఈ కేసును ఎన్ఐఏ కు ఇస్తూ నిర్ణ‌యం తీసుకుంది. తాము తీసుకున్న నిర్ణ‌యాన్ని ఎన్ఐఏ హైకోర్టు నివేదించింది. దీని ప్ర‌కారం..ఎన్ఐఏ ఇప్ప‌టికే ఈ కేసు లో ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి..విచార‌ణ ప్రారంభించింది.

AP Govt objection on NIA investigation : Letter to Home Affairs..

ఏపి ప్ర‌భుత్వ అభ్యంత‌రం ఏంటంటే..!

జ‌గ‌న్ పై దాడి కేసు లో ఇప్ప‌టికే ఏపి ప్ర‌భుత్వం విచార‌ణ పూర్తి చేస్తే...ఎన్ఐఏ కు ఇవ్వ‌టం ఏంట‌ని ఏపి ప్ర‌భుత్వం ప్ర‌శ్నిస్తోంది. ఎన్ఐఏ ఉగ్ర‌వాదం..విమానాల హైజాక్ వంటి కేసులు ద‌ర్యాప్తు చేసే సంస్థ‌ని ఏపి ప్ర‌భుత్వ న్యాయ‌వాదు లు వాదిస్తున్నారు. జ‌గ‌న్ పై దాడి కేసు వారి ప‌రిధిలోకి రాద‌ని చెబుతున్నారు. ఏపి పోలీసులు చేసిన విచార‌ణ నివేదిక ను కోర్టుకు సీల్డ్ క‌వ‌ర్ లో స‌మ‌ర్పించారు. అయిన‌ప్ప‌టికీ..హైకోర్టు ఎన్ఐకే అప్ప‌గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

దీంతో.. ఈ ఈ అంశం పై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వం జ‌గ‌న్ కేసును ఎన్ఐఏ కు అప్ప‌గిస్తూ తీసుకున్న నిర్ణ‌యా న్ని త‌ప్పు బ‌డుతూ కేంద్ర హోం శాఖ‌కు లేఖ రాయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. అయితే, ఏపి ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం పై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తుంద‌నే స‌మాచారం పై వైసిపి నేత‌లు వేచి చూసే ధోర‌ణితో ఉన్నారు. ప్ర‌భుత్వం నుండి అధికారికంగా స్పంద‌న వ‌చ్చిన త‌రువాత స్పందిస్తామ‌ని చెబుతున్నారుద‌. రాజ‌కీయంగా..వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌నేది ప్ర‌భుత్వ పెద్ద‌ల భ‌యంగా వైసిపి నేత‌లు ఆరోపిస్తున్నారు.

English summary
Ap Govt not agreeing with Central Govt decision. Govt lawyers argued in court against jagan case to NIA. Ap govt ready to writing a letter to Central Home Affairs regarding this decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X