ఆరోగ్యశ్రీ అమల్లో ప్రభుత్వం కీలక మార్పులు - ఇక నుంచి..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఆరోగ్య శ్రీ సేవల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రణాళికలపై కసరత్తు జరుగుతోంది. ఆరోగ్య శ్రీ స్థానం లో కొత్తగా ఆరోగ్య భీమా సదుపాయం తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అందు లో భాగంగా రాష్ట్రంలో అందరికీ ఆరోగ్య భీమా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజా ప్రతిపాదనల పైన త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోనుంది.
ఆరోగ్య భీమా
ఏపీలో ఉచిత ఆరోగ్య భీమా అమల్లోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే భీమా కంపెనీలతో ప్రాధమిక చర్చలు పూర్తయ్యాయి. భీమా కంపెనీల చర్చల్లో వచ్చిన ప్రతిపాదనలు..అమలు పైన అధికారులు ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేసారు. ఈ విధానం అమల్లోకి వస్తే ఆరు గంటల్లోనే భీమాకు అనుమతి వచ్చేలా కసరత్తు చేస్తున్నారు. ఇందు కోసం ఉమ్మడి శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక యూనిట్, గుంటూరు నుంచి రాయలసీమ జిల్లాల వరకు మరో యూనిట్‌గా గుర్తించి టెండర్లు పిలిచేందుకు రంగం సిద్దమైంది.

భీమా సౌకర్యం
ఆరోగ్య శ్రీ లో చికిత్స పరిమితిని జగన్ ప్రభుత్వ హయాంలో రూ 25 లక్షలకు పెంచారు. ప్రస్తుతం
ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు కింద ఏడాదికి 25 లక్షల విలువైన చికిత్సలను ఉచితంగా ప్రస్తుతం అందిస్తున్నారు. కొత్త బీమా విధానంలో వార్షిక పరిమితి, ఇతర షరతులతో నిమిత్తం లేకుండా ప్రజ లందరికీ ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. తాజా నిర్ణయం మేరకు ఇప్పుడున్న 25 లక్షల వార్షిక పరిమితి వైద్య సేవలు అలాగే కొనసాగిం చాలని నిర్ణయించారు. అయితే ఏడాదికి రెండున్నర లక్షల రూపాయల వైద్య సేవలు ఉచితంగా అందించేలా టెండరు ఖరారు చేస్తున్నారు. ఆపైన చికిత్సకు అయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు భరించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
ఏప్రిల్ నుంచి అమలు
ప్రస్తుతం వార్షిక ఆదాయం 5 లక్షలలోపు ఉన్న వారికి ట్రస్టు ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి. ఈ పరిధిలో కోటీ 43 లక్షల కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగు లు, పెన్షనర్లు కలిపి ఎనిమిదిన్నర లక్షల మంది ఉన్నారు. బీమా పథకం కింద ఏడాదికి ఒక్కో ఉద్యోగి, పెన్షనర్ సుమారు 7వేల వరకు చెల్లిస్తున్నారు. జర్నలిస్టులు కూడా ప్రీమియం చెల్లిస్తు న్నారు. ప్రీమియం చెల్లించే జాబితాలో ఉన్న వారికి మినహాయించి, మిగిలిన వారందరికీ బీమా విధానాన్ని వర్తింపచేసేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటి పైన సీఎం చంద్రబాబు సమక్షంలో నిర్ణయం తీసుకొని ఏప్రిల్ నుంచి అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది.
-
Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..! -
స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల సేవల పై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం, తాజా ఆదేశాలు..!! -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!!












Click it and Unblock the Notifications