సంక్షేమానికి రెట్టింపు నిధులు : కమ్మ- రెడ్డి- కాపు వర్గాలకు సైతం : రూ 2.56 లక్షల కోట్లతో బుగ్గన బడ్జెట్..!!

సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ..సామాజిక వర్గాల వారీగా కేటాయింపులు చేస్తూ.. నవరత్నాల అమలే లక్ష్యంగా ఆర్దిక మంత్రి బుగ్గన శాసనసభలో 2022-23 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ముందు నుంచి చెబుతున్నట్లుగానే జగన్ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది. అందులో బీసీ..ఎస్సీ..ఎస్టీ..మైనార్టీ వర్గాలతో పాటుగా ఆర్దికంగా వెనుక బడిన వర్గాలకు కేటాయింపులు చేసింది. ఇక, సామాజిక వర్గాల వారీగా ఏర్పాటు చేసిన కార్పోరేషన్లను నిధులు కేటాయింపులు చేసారు.

2.56 లక్షలతో బడ్జెట్ ప్రతిపాదనలు

2.56 లక్షలతో బడ్జెట్ ప్రతిపాదనలు

మొత్తం 2,56,256 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించారు. రెవిన్యూ వ్యవయం 2,08,261 కోట్లు కాగా, మూల ధన వ్యవయం రూ 47,996 కోట్లుగా పేర్కొన్నారు. ఇక..రెవిన్యూ లోటు రూ 17,036 కోట్లు గా వెల్లడించారు. ద్రవ్య లోటు రూ. 48, 724 కోట్లుగా ప్రతిపాదించారు. ఇక, సంక్షేమ కేటాయింపుల్లో భాగంగా బీసీ సంక్షేమానికి రూ 20,962 కోట్లు ప్రతిపాదించారు. వైఎస్సార్ కాపు నేస్తం 500 కోట్లు కేటాయించారు. సాంఘిక సంక్షేమం కోసం రూ. 12,728 కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదించారు. మైనార్టీ సంక్షేమం కోసం రూ 1,750 కోట్లు కేటాయించారు. ఇక.. వీరితో పాటుగా ఈడబ్ల్యూఎస్ వర్గాల కోసం రూ. 10,201 కోట్లు కేటాయింపుల్లో చూపించారు.

నవరత్నాలకు భారీగా కేటాయింపులు

నవరత్నాలకు భారీగా కేటాయింపులు

నవరత్నాల అమల్లో భాగంగా...వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక రూ. 18 వేల కోట్లు కేటాయింపులు చేసారు. అదే విధంగా.. వైఎస్సార్‌ రైతు భరోసా రూ. 3,900 కోట్లు మంజూరు చేసారు. జగన్న చేదోడు రూ. 300 కోట్లు కేటాయిస్తున్నట్లుగా బడ్జెట్ ప్రసంగంలో బుగ్గన ప్రకటించారు. నేతన్న హస్తం కోసం రూ. 199 కోట్లు ప్రతిపాదించారు. మత్య్సకార భరోసా రూ. 120 కోట్లు ప్రతిపాదించారు. ఎస్సీ సబ్ ప్లాన్ రూ. 18,518 కోట్లు ప్రతిపాదించారు. బీసీ సబ్ ప్లాన్ రూ.29,143 కోట్లు ప్రతిపాదిస్తూ తమది బీసీ అంటే బ్యాక్ బోన్ అని నమ్మే ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. వీటితో పాటుగా.. ఈబీసీ సంక్షేమం కోసం 6,639 కోట్లు ప్రతిపాదించారు. మైనార్టీ యాక్షన్ ప్లాన్ 3,532 కోట్లు ప్రతిపాదిస్తుననట్లు బుగ్గన ప్రకటించారు. ఎస్టీ సబ్ ప్లాన్ రూ. 6,145 కోట్లు ప్రతిపాదించారు.

రెడ్డి -కమ్మ-కాపు కార్పోరేషన్లకు

రెడ్డి -కమ్మ-కాపు కార్పోరేషన్లకు

ఇక, నవరత్నాల్లో భాగంగా సీఎం జగన్ మానస పుత్రిక అయిన అమ్మ ఒడికి రూ. 6500 కోట్లు ప్రతిపాదించారు. కాపుల సంక్షేమం కింద రూ 3,531 కోట్లు కేటాయిస్తూ బుగ్గన ప్రకటించారు. ఆసరా సంక్షేమం రూ 6400 గా కేటాయించారు. వైఎస్సార్ చేయూత నిర్వహణ కోసం రూ. 4235 కోట్లు కేటాయించారు. ఇక, వీటితో పాటుగా సామాజిక వర్గాల వారీగా ఏర్పాటు చేసిన కార్పోరేషన్ల కు నిధులు ప్రతిపాదించారు. అందులో భాగంగా కమ్మ సంక్షేమం - 1,899 కోట్లు, కాగా...రెడ్డి సంక్షేమం -3,088 కోట్లు ప్రతిపాదించారు. వైశ్య సంక్షేమం కోసం- 915 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లుగా బుగ్గన వెల్లడించారు.

విద్య - వైద్యానికి ప్రాధాన్యత

విద్య - వైద్యానికి ప్రాధాన్యత

క్రిస్టియన్ కార్పెరేషన్ కు 113 కోట్లు కేటాయింపులు చేసారు. అనూహ్యంగా ఎస్సీ సబ్ ప్లాన్ రూ. 18,518 కోట్లు ప్రతిపాదిస్తూ బుగ్గన తన ప్రసంగంలో పేర్కొన్నారు. బ్రాహ్మణ కార్పోరేషన్ కు కేటాయింపులు చేసారు. ఆ తరువాత విద్యా శాఖ..వ్యవసాయం.. ఇరిగేషన్ శాఖకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. రోడ్లు భవనాలకు ఈ బడ్జెట్ లో కేటాయింపులు పెరిగాయి. నాడు - నేడు కోసం రూ 3500 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఇక, ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెంచారు. ప్రతీ మండలంలో 104 సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+