FSSAI కొత్త రూల్స్: హోటళ్లు, బేకరీలకు వార్నింగ్, ఫేమస్ బ్రాండ్లకు షాక్

మనం రోజువారీ జీవితంలో కొనుగోలు చేసే ఆహార పదార్థాల విషయంలో ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. లాభాల వేటలో పడి వినియోగదారుల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న బ్రాండ్లపై కేంద్ర.. ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) ఉక్కుపాదం మోపుతోంది. అటు ప్యాకింగ్ విషయంలోనూ, ఇటు ప్రకటనల విషయంలోనూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది.

మిఠాయి దుకాణాలు, బేకరీలు, హోటళ్లలో ఆహార పొట్లాలు, కేకు బాక్సులను స్టాపుల్ పిన్నులతో ప్యాక్ చేయడం మనకు నిత్యం కనిపించే దృశ్యమే. అయితే, ఈ అలవాటు వినియోగదారుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఇటీవల కొన్ని ప్రాంతాలలో కేకులు, ఇతర తినుబండారాలను పిన్నులతో ప్యాక్ చేయగా, అవి తెలియకుండానే ఆహారంతో పాటు కడుపులోకి వెళ్లి పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

FSSAI Bans Staple Pins in Food Packing and Issues Show Cause Notices to 8 Major Misleading Brands

దీనిని అత్యంత ప్రమాదకరమైన విషయంగా పరిగణించిన FSSAI.. ఇకపై ఆహార ప్యాకింగ్‌లో స్టాపుల్ పిన్నులు, మెటాలిక్ వస్తువులు, ఇనుప తీగలను ఉపయోగించడాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ నిబంధనను అతిక్రమించి ప్యాకింగ్ చేస్తే వ్యాపారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

'హెల్తీ' పేరిట మభ్యపెడితే నోటీసులే: బోనులో ప్రముఖ బ్రాండ్లు

మార్కెట్లో లభించే వివిధ ఆహార ఉత్పత్తులపై 'హెల్తీ', 'ఆరోగ్యకరం' అంటూ తప్పుదోవ పట్టించే లేబుళ్లను వాడటంపై FSSAI ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తున్న ఎనిమిది ప్రముఖ ఆహార కంపెనీలకు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ బ్రాండ్లు ఇవే..

ఇండియన్ ఆర్మీ కొత్త రూల్స్.. మీసాలు పెంచితే యాక్షనే!
ఇండియన్ ఆర్మీ కొత్త రూల్స్.. మీసాలు పెంచితే యాక్షనే!
  • ఇమామీ హెల్తీ అండ్ టేస్టీ: వంటనూనెల వ్యాపారంలో ఉన్న ఈ బ్రాండ్ పేరులోనే 'హెల్తీ' అని వాడుతూ వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తోందని నియంత్రణ సంస్థ ఆక్షేపించింది.
  • ప్లాన్ బి (Plan B): ఎలాంటి ముందస్తు లైసెన్స్ లేదా FSSAI అనుమతి (ఎండార్స్‌మెంట్) లేకుండానే తన ఉత్పత్తులను 'ప్లాంట్ బేస్డ్ వెగాన్'గా ప్రచారం చేస్తూ విక్రయిస్తోంది.
  • ది హెల్తీ ఫ్యాక్టరీ: ఈ సంస్థ తయారు చేస్తున్న 'జీరో మైదా హోల్ వీట్ బ్రెడ్', 'జీరో మైదా పిజ్జా బేస్'లలో గోధుమ గ్లూటెన్ అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
  • న్యూహెర్బ్స్: ఈ కంపెనీ విక్రయిస్తున్న 'ట్రూ విటమిన్' అనే ట్రేడ్ పేరుకు సరైన నిర్వచనం లేదని హెచ్చరించింది.
  • ట్రూవీ, హెల్తీ మాస్టర్, హెల్తీ ఛాయిస్, హెల్త్ ఎయిర్డ్: ఈ బ్రాండ్ల నామకరణాలు, చిప్స్ వంటి ఉత్పత్తుల ప్రకటనలు కూడా నిబంధనలకు లోబడి లేవని స్పష్టం చేసింది.

ఈ సంస్థల నుంచి వచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే భారీ జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు వెల్లడించారు.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

FSSAI నిబంధనల ప్రకారం.. ఏదైనా కంపెనీ తమది 'వెగాన్' (శాకాహార) ఆహారమని ప్రచారం చేసుకోవాలంటే దానికి ప్రత్యేకమైన 'వెగాన్ లోగో'ను పొందడం తప్పనిసరి. అలాగే, మైదా లేని (జీరో మైదా) ఉత్పత్తులని విక్రయించేటప్పుడు అందులో గ్లూటెన్ శాతాన్ని కూడా ఖచ్చితంగా నియంత్రణలో ఉంచాలి. కానీ, ప్రస్తుత మార్కెట్లో చాలా కంపెనీలు కేవలం ట్రేడ్‌మార్క్ పేర్లను ఆసరాగా చేసుకుని ప్రజలను మభ్యపెడుతున్నాయి.

Driving Licence: ఇక 50 ఏళ్ల వ్యాలిడిటీతో? కేంద్రం సరికొత్త రూల్స్!
Driving Licence: ఇక 50 ఏళ్ల వ్యాలిడిటీతో? కేంద్రం సరికొత్త రూల్స్!

వినియోగదారులు ఎలా అప్రమత్తంగా ఉండాలి?

ఆహార పదార్థాలను కొనుగోలు చేసేటప్పుడు సామాన్య ప్రజలు మోసపోకుండా ఉండటానికి నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు:

  • ప్యాకెట్లపై ఉండే ఆకర్షణీయమైన రంగులు, 'హెల్తీ' అనే పెద్ద పెద్ద పేర్లను చూసి మోసపోవద్దు.
  • ప్యాకెట్ వెనుక భాగంలో ఉండే 'దినుసుల జాబితా' (Ingredients List) ను చదవడం అలవాటు చేసుకోండి. అందులో వాడిన పదార్థాల శాతం స్పష్టంగా ఉంటుంది.
  • ప్యాకెట్‌పై FSSAI గుర్తింపు చిహ్నం, లైసెన్స్ నంబర్ ఉన్నాయో లేదో గమనించండి.
  • వస్తువు తయారీ తేదీ (Mfg Date), ఎక్స్‌పైరీ తేదీలను తప్పకుండా సరిచూసుకున్న తర్వాతే కొనుగోలు చేయండి.

ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రభుత్వ నిబంధనలతో పాటు వినియోగదారుల అప్రమత్తత కూడా ఎంతో అవసరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+