'పెద్ది' ఓటీటీ విడుదల తేదీ ఇదేనా..? ఇంత తొందరగానా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో వచ్చిన మూవీ పెద్ది.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా రన్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 4 న విడుదలైన ఈ మూవీ ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ రూ. 400 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా దూసుకెళ్తోంది.

విడుదలై 11 రోజులు అవుతున్నా ఈ మూవీకి అనేక ప్రాంతాల్లో హౌస్ ఫుల్స్ నమోదు అవుతున్నాయి. అయితే ఇటీవల టికెట్స్ రేట్లు తగ్గించడం, మూడు నాలుగు కొత్త సీన్లను యాడ్ చేయడంతో యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ మరోసారి ఈ సినిమాకు క్యూ కట్టడం మొదలు పెట్టారు. దాంతో పెద్ది ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా లేదని తెలుస్తోంది. లాంగ్ రన్ లో ఈ మూవీకి భారీగానే కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ సౌత్ ఇండియా బిగ్గెస్ట్ గ్రాసర్ 2026 గా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని ఇటీవల పెద్ది మూవీ టీమ్ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించింది.

అయితే ప్రస్తుతం థియేటర్ల వద్ద విజయవంతంగా రన్ అవుతున్న ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం అందుతోంది. రిలీజ్ కు ముందు ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ దాదాపుగా రూ. 140 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల అనంతరం హిందీ మినహా అన్ని ఇతర భాషల్లో ఈ మూవీని స్ట్రీమింగ్ చేసుకోవచ్చని నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారు. ఇక హిందీ వెర్షన్ ను 7 వారాల తర్వాత అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. అయితే నిర్మాతలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఈ సినిమా కచ్చితంగా జులై 1 లేదా జులై 2 తేదీలలో విడుదల అవ్వాల్సి ఉంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ సంస్థ కూడా రెడీ అయ్యినట్టు తెలుస్తోంది.

RamCharan and Buchi Babu Sana s Movie Set for OTT Release on July 1 or 2 Fans Await Big Update

ఈ మేరకు పెద్ది ఓటీటీ రిలీజ్ కు సంబంధించిన వివరాలపై వచ్చే వారం అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే పెద్ది మూవీలోని బ్లాక్ బస్టర్ చికిరి సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక పెద్ది సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిచింది. అలాగే జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, శివరాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అలాగే ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా సతీశ్ కీలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+